శ్రీ సిటీని సందర్శించిన వైజాగ్ సెజ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్

 

శ్రీసిటీని సందర్శించిన వైజాగ్ సెజ్ జోనల్ డెవలప్మెంట్ కమీషనర్
 
శ్రీసిటీ, అంతిమతీర్పు, సెప్టెంబర్ 09, 2019:

 

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (వీ ఎస్ ఈ జెడ్)  జోనల్ డెవలప్మెంట్ కమీషనర్ ఏ.రామమోహన్ రెడ్డి (ఐఎఫ్ఎస్) సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సెజ్ డీసీ కార్యాలయం వద్ద డెవలప్మెంట్ కమీషనర్ ఆర్.ముత్తురాజ్ ఆయనకు సాదరస్వాగతం పలికి, శ్రీసిటీ పురోగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ నుంచి బిజినెస్ సెంటర్ వద్దకు వెళ్లిన జోనల్ డీసీకి శ్రీసిటీ సీఎఫ్ఓ నాగరాజన్ స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రత్యేకతలు, మౌళిక వసతుల గురించి నమూనా, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు, సిద్దార్థ లాజిస్టిక్స్, యూ ఎన్ పి, ఎవెర్టన్, బీ ఎఫ్ జీ పరిశ్రమలను సందర్శించారు.