కేసీఆర్ తో జగన్ చర్చలు

23–09–2019
హైదరాబాద్‌


హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావుతో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి చర్చలుహైదరాబాద్‌:  తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావుతో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి వెంట వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఉన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ , తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావును ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక అంశాలపై చర్చించారు. కృష్ణా డెల్టా, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చడానికి గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపుపై ఇదివరకే ఇరురాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. దీనిపై మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. దీంతోపాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపైకూడా దృష్టిపెట్టారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image