: పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

27–09–2019
అమరావతి


అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష 
మంత్రి బొత్ససత్యన్నారాయణ సహా ఉన్నతాధికారులు, అధికారులు హాజరు
నగరాలు, మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సుదీర్ఘ చర్చ
తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థ్యాల తొలగింపు, మురుగునీటి శుద్ధి,
పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
వీటికోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు,  చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సమీక్షించిన సీఎం
మున్సిపల్‌ స్కూళ్లను అభివృద్దిచేయడంపైనా సమీక్షించిన సీఎం
స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమంలో మూడింట ఒక వంతు నగరాలు, మున్సిపాల్టీల స్కూళ్లను తీసుకోవాలని సీఎం ఆదేశం
ప్రతి మున్సిపాల్టీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉండాలి
మురుగునీటి శుద్ధి ఉండాలి
సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ ఉండాలి
ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాల్టీకి కార్యాచరణ సిద్ధం చేయండి
తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలి


పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడంలేదన్న సీఎం
ఆమేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలన్న సీఎం
ప్రతి ఇంటికి సంబంధించిన తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ... అనేవాటిపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలి
ఏ సమస్య వచ్చినా.. వెంటనే వాటిని తీర్చేలా చూడాలన్న సీఎం
ఏ విజ్ఞాపన వచ్చినా.. వాటిని అడ్రస్‌ చేయాలన్న సీఎం


*ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి*


తాడేపల్లి, మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా తయారు చేయడంపై సమావేశంలో చర్చ
భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలపై చర్చ
ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై చర్చ
తాడేపల్లి, మంగళగిరుల్లో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశం
తాడేపల్లిలో కనీసం 15వేల ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశం
కట్టే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలికసదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు.. ఇలా కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశం
తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశం


*కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చ*
*వారికి శాశ్వతంగా సమస్య తీర్చాలని సీఎం ఆదేశాలు* 
* ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు  ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం*
*ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం*
*పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వీటికారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం*
*ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశం*
*వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నామన్న సీఎం
కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారన్న ముఖ్యమంత్రి*
*నగరాల్లో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందన్న సీఎం, అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదన్న సీఎం*
*వరదనీరు ప్రవహించే మార్గాల్లో నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతాయి:
కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనం సమస్యలను కొనితెచ్చుకున్నట్టే...:*
*పైగా వాటికి చట్టబద్ధత ఉండదూ, ఎప్పటికీ పట్టా కూడా రాదు, చట్టాలు దీనికి అంగీకరించవు:* 
*అందుకే నదీపరీవాహక ప్రాంతాలకు భంగం కాకుండా.. చూడాల్సిన బాధ్యత మనపై ఉంది:*
*పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహిరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయండి, అవగాహన కలిగించండి:*
*ఇవికాకుండా ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలం ఇళ్లుకట్టి ఉంటున్నవారికి పట్టాలు మంజూరుచేయాలని కూడా సీఎం ఆదేశం:*


బకింగ్‌ హాం కెనాల్‌ కాలుష్యంకాకుండా చూడాలన్న సీఎం
కాల్వ గట్లపై చెట్లను బాగా పెంచాలన్న సీఎం
విస్తారంగా చెట్లను పెంచాలని కూడా సీఎం ఆదేశం
ఇంటర్నెట్‌ సదుపాయంకూడా కల్పించాలన్న సీఎం
పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడంద్వారానే ఆదర్శ మున్సిపాల్టీ సాధ్యం


*మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా ఏం చేయగలరు? అధికారులకు సీఎం ప్రశ్న*
*ఏ పౌరుడూ, ఏ బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదు*


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image