కృష్ణానదిలో అక్రమ కట్టడాలపై చర్యలు.

అమరావతి
23.9.2019
*కృష్ణానదిలో అక్రమ కట్టడాలపై చర్యలు.
*చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమే.
*గతంలో లింగమనేని రమేష్‌ కు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది*
*పాతూరు కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణంను సీఆర్డీఏ అధికారులు తొలగించారు.*
*చంద్రబాబు నివాసంనే తొలగిస్తున్నారంటూ ఎల్లో మీడియా అసత్య ప్రచారం.*
*చట్టప్రకారమే అక్రమ నివాసాలపై చర్యలు*
*సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ గారు కృష్ణానది ఆక్రమణలను సహించం అని గతంలోనే చెప్పారు.*
*నదీ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తాం.*
*రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి శ్రీ మంత్రి బొత్స సత్యనారాయణ* 
 
కృష్ణానదిలో అక్రమ కట్టడాలు పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ తెలిపారు. నదీపరివాహక చట్టాలకు విరుద్దంగా కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. ఈ మేరకు చట్ట వ్యతిరేకమైన నిర్మాణాలకు గతంలోనే సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. దీనితో కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారని అన్నారు. అయితే చట్టపరంగా, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ రోజు పాతూరు కోటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన అక్రమ కాంక్రీట్‌ నిర్మాణంను సీఆర్డీఏ ఆధ్వర్యంలో తొలగించారని వెల్లడించారు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నామంటూ ఎల్లో మీడియా ద్వారా టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చంద్రబాబు ఉంటున్న లింగమనేని రమేష్‌ కు చెందిన అతిధిగృహం కూడా నదీపరీవాహక చట్టాలకు విరుద్దంగా నిర్మించినదేనని అన్నారు. ఈ భూమిని లింగమనేని రమేష్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సీఆర్డీఏ రికార్డుల ప్రకారం సదరు భూమికి లింగమనేని రమేష్‌ యజమానిగా వున్నారని, ఈ మేరకే ఆయన పేరుమీద అక్రమ కట్టడానికి నోటీస్‌ ఇచ్చారని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వివరించారు. ఒక్క లింగమనేనికి చెందిన అతిథిగృహంతో పాటు ఏడుగురు అక్రమ కట్టడాల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందని, త్వరలోనే వాటిని కూడా తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. కరకట్ట దిగువన అక్రమ కట్టడాలను తొలగిస్తుండటంతో చంద్రబాబు ఎల్లో మీడియాతో ఏకంగా తన నివాసంనే తొలగిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేయించుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గారు నదీపరీవాహక పరిరక్షణ చట్టాల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా వుందని, కృష్ణానదిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.