10న విశాఖకు  చంద్రబాబు

10న విశాఖకు  చంద్రబాబు
రెండు రోజులు పార్టీ కార్యాలయంలోనే బస
తొలిరోజు కార్యకర్తలతో సమావేశం
రెండో రోజు నియోజకవర్గాల వారీగా సమీక్షలు
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల పదవ తేదీన విశాఖ పర్యటనకు రానున్నారు. ఆయన రెండు రోజులపాటు నగరంలోని పార్టీ కార్యాలయంలో బస చేయనున్నారు. తొలిరోజు కార్యకర్తలతో సమావేశం అవుతారు. మరుసటి రోజు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పర్యటనపై నేతలు చర్చించారు. నియోజక వర్గాలలో పార్టీపరంగా వున్న అంశాలపై నాయకులు, కేడర్‌ నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారని పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు