విఆర్ లో రిపోర్ట్

గుంటూరు అర్బన్ లోని నార్త్  సబ్-డివిజన్ పరిధి నందలి  మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేయుచున్న ఎస్సై ప్రతాప్ కుమార్ పై ఆరోపణలు మరియు విధుల్లో అలసత్వం వహించి నందులకు గాను విచారణలో భాగంగా గుంటూరు అర్బన్ విఆర్ లో రిపోర్ట్ చేయవలసిందిగా ఎస్పీపి.హెచ్.డి. రామకృష్ణ, ఐపిఎస్., ఉత్తర్వులు జారీచేసినారు. విచారణ అనంతరం నిబంధనల మేరకు చర్యలుంటాయని ఎస్పీ తెలియజేసినారు.


 గత ఆగస్టు నెల 24 వ తేదీన పోలీస్ కాండక్టు రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న  మంగళగిరి రూరల్ కు చెందిన రైటర్ కానిస్టేబుల్ మరియు మంగళగిరి టౌన్ కు చెందిన రైటర్ కానిస్టేబుల్ ను ప్రాథమిక విచారణఅనంతరం గుంటూరు అర్బన్ నందు సాయుధ విభాగాల విధులకు ఎస్పీ  పంపారు.