కాణిపాకం శ్రీ వినాయకస్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ పట్టువస్త్రాల సమర్పణ

కాణిపాకం శ్రీ వినాయకస్వామివారికి టిటిడి ఛైర్మ‌న్ పట్టువస్త్రాల సమర్పణ
తిరుప‌తి :  కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగ‌ళ‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ప్ర‌త్యేకాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మ‌న్‌ దంపతులకు, ప్ర‌త్యేకాధికారికి కాణిపాకం ఆలయ ఈఓ శ్రీ దేముళ్లు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.  కాణిపాకంలో సెప్టెంబరు 2న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో  భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం జరుగనుంది. ఈ కల్యాణం కోసం టిటిడి  పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.