పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు: మంత్రి సురేష్

టెన్త్‌ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
అమరావతి : పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను రద్దు చేసింది. గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  '' పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం. పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను తొలగించాము. గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు రద్దు చేశాం. బిట్ పేపర్‌ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసాం. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తాం. 2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నాం. మార్కుల షీట్‌ని కూడా నాణ్యంగా తయారుచేస్తాం. పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తాం. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించాం. 45,390 పాఠశాలల్లో  ఎన్నికలు పూర్తి చేశాం. పాఠశాలల్లో విద్యాశాఖ అమలుచేసే పథకాలపై కమిటీలకు అవగాహన కల్పిస్తాం. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేస్తాం. మన బడి.. మన బాధ్యత పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపడతా''మన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image