అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌
ఆస్తుల విలువలు బాగా పెరగడంతో అడ్డదారులు
మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు.. త్వరలో ఉత్తర్వులు
అమరావతి : మోసపూరిత, డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇటీవల కాలంలో మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ రిజిస్ట్రేషన్‌ జిల్లాలోనే 84 ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉండగా ఆరింటిలో ఎలాంటి ఫిర్యాదుల్లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్‌ జిల్లాలను పరిశీలిస్తే విజయవాడలో 84, విశాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతపురంలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మొత్తం ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపింది. 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ సాగుతోంది. కొన్ని పెండింగులో ఉండగా మరికొన్నింటిని రకరకాల మార్గాల్లో పరిష్కరించారు.
స్థిరాస్తుల విలువ పెరగడంతో : భూములు, స్థలాలు తదితర స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగినందువల్లే భారీ మోసాలు జరుగుతున్నాయి. తమది కాని భూమిని యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాల ద్వారా అక్రమార్కులు విక్రయిస్తున్న సంఘటనలు కోకొల్లలు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలంటూ ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. సివిల్‌ కోర్టుల ఆదేశాలు లేనిదే రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల్లోనూ స్థిరపడిన వారి భూములు, స్థలాలపై మాఫియా గ్యాంగులు కన్నేసి నకిలీ ఆధార్, ఇతర పత్రాలు సృష్టించి వాస్తవ యజమానులకు తెలియకుండానే విక్రయించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ మోసాలు ఎక్కువ. వాస్తవ యజమానులు వీటిని విక్రయించడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లే వరకూ తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీచేయనుంది.  
ప్రాసిక్యూషన్‌ చేయిస్తాం : ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిస్తే ప్రాసిక్యూషన్‌ చేయించి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్లు తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా మోసాల నియంత్రణకు ఆయన పలు సూచనలు చేశారు. 
- తమ స్థిరాస్తులను వేరేవారు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే ఛీటింగ్‌ కేసులు పెట్టాలి. 
- తమ భూమిని వేరేవారు అమ్మేసినట్లు తెలియగానే భూ యజమాని మ్యుటేషన్‌ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేయవద్దని తహసీల్దారుకు ఫిర్యాదు చేయాలి. అప్పుడా రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదు. 
- వెబ్‌ల్యాండ్‌లో మోసాలు జరగకుండా భూ యజమానుల ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరు కూడా పక్కాగా నిర్వహించడం ద్వారా ఎలాంటి మోసాలకు అవకాశంలేకుండా చేయొచ్చు.  
మోసాలివీ..
- రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణమ్మకు భర్త చిన్న సూర్యనారాయణ ద్వారా బహుమతి రూపంలో 15.14 ఎకరాల భూమి లభించింది. కానీ, రామకృష్ణమ్మ 20.78 ఎకరాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. అంటే.. ఆమె తనకున్న భూమి కంటే 5.64 ఎకరాలు అదనంగా అమ్మేశారు.  తనను మోసగించిన బాధ్యుల (రామకృష్ణమ్మ, సబ్‌ రిజిస్ట్రారు)పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వెంకట సుధామయి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లేని భూమిని విక్రయించిన రామకృష్ణమ్మ చనిపోయారు. ఆమె పిల్లల పేరుతో బహుమతి కింద చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదు. 
- గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పయనీర్‌ ఫాస్పేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 3.66 ఎకరాల భూమిని మాజీ డైరెక్టర్లు తప్పుడు మార్గంలో విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేశారు. వారు డైరెక్టర్‌ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రికార్డులు చూపించి భూమిని అమ్మేశారు. 
- అమెరికాలో నివాసం ఉంటున్న కాకినాడకు చెందిన మహిళ స్థలాన్ని ఆమెకు తెలియకుండా వేరే వారు విక్రయించారు. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి తనకు న్యాయం చేయాలని ఆమె ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు విజ్ఞప్తి చేశారు.


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image