జయసాయి అలా మాట్లాడారంటే అవకతవకలు జరిగినట్లే కదా: వర్ల రామయ్య

జయసాయి అలా మాట్లాడారంటే అవకతవకలు జరిగినట్లే కదా: వర్ల రామయ్య
అమరావతి : వలంటీర్ల ఉద్యోగాల్లో 90% మన వాళ్లకేనన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్య తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ పోస్టులూ ఎక్కువ శాతం మనవాళ్లకే అన్నారని పేర్కొన్నారు. ''విజయసాయిరెడ్డి పైన సుమోటో కేస్ రిజిస్టర్ చెయ్యాలి. వాలంటీర్ల ఉద్యోగాల్లో 90% మన వాళ్ళకే, గ్రామ సచివాలయ పోస్టులు కూడా ఎక్కువ శాతం మనవాళ్లకే అన్న ఆయనపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వంలో ముఖ్యుడైన ఆయన అలాగంటే అవకతవకలు జరిగినట్లే గదా? నియామకాలు రద్దు చేసి బాద్యులపై ఎందుకు చర్యలు తీసుకోరు?'' అని వర్ల రామయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.