కేజీహెచ్‌లో ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి అవంతి

కేజీహెచ్‌లో ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి అవంతి
విశాఖ: మంత్రి అవంతి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం కేజీహెచ్‌ ఆస్పత్రిలో ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున, వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కి వైఎస్‌ఆర్ బ్లాక్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. గోదావరి బోటు ప్రమాదంపై విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. బోటు నిర్వహకుడు టీడీపీ మద్దతుదారుడని, గత ప్రభుత్వం హయాంలోనే అనుమతి ఇచ్చారన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు కూడా ఈ బోట్‌లోనే ప్రయాణించారని తెలిపారు. తనకు బోటు వ్యాపారాలు వున్నాయనేది రాజకీయ దుష్ప్రచారమన్నారు. తన కుటుంబ సభ్యులకు బోటు వున్నట్టు నిరూపిస్తే.. వాటిని రాసిచ్చేయడానికి సిద్ధమన్నారు. బోటు బాధితులకు ప్రభుత్వం నేరుగానే పరిహారం అందజేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. పరిహారం కోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని, శవాలపై బొగ్గులు ఏరుకునే మనుషులు సమాజంలో వున్నారని.. సైబర్ నేరగాళ్లతో బాధితులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి అవంతి సూచించారు.