_రెండు రోజుల మైనారిటీ రుణాల అవగాహన సదస్సు ప్రారంభించిన కృష్ణ కలెక్టర్_


    _రెండు రోజుల మైనారిటీ రుణాల అవగాహన సదస్సు ప్రారంభించిన కృష్ణ కలెక్టర్_ 


    విజయవాడ:     కేంద్ర ప్రభుత్వం  మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేయబడుతున్న వివిధ ప్రభుత్వ పథకాల పై మైనారిటీ లబ్ధిదారులకు రెండు రోజుల అవగాహన సదస్సు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజయవాడ హోటల్ మనోరమ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నాడు ప్రారంభించారు. మైనార్టీ రుణాలను ఎలా పొందాలో మైనారిటీ వర్గాలు కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ల కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయా వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెప్పారు ఈ అవగాహన సదస్సుల వల్ల ఏ ఏ పథకానికి ఏ విధంగా పొందవచ్చును అనే వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రఘు మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు స్వయం కృషి ద్వారా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. తమ సంస్థ ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా మన్నారు. మహిళలు గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందవచ్చునని అదేవిధంగా విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లో ఈ సంస్థ డైరెక్టర్  సిరాజుద్దీన్ మరియు మైనారిటీ మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.