స్టేట్ బ్యాంక్ సేవల్లో మరో అస్త్రం యూ ఓన్లీ నీడ్ వన్

వింజమూరు


: భారతీయ స్టేట్ బ్యాంక్ అందించే సేవలలో భాగంగా నూతనంగా యూ ఓన్లీ నీడ్ వన్ యాప్ విధానమును ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్.బి.ఐ వింజమూరు శాఖ బ్రాంచ్ మేనేజర్ బి.శాంతిరాజు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జి.సిహెచ్.నాగేశ్వరరావులు తెలిపారు. బుధవారం స్థానిక బ్యాంకు ఆవరణలో ఖాతాదారులతో అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూ ఓన్లీ వన్ నీడ్ యాప్ ద్వారా నూతనంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, అకౌంట్లు బదిలీ, రుణాలకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకునే ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అంతేగాక ఈ యాప్ ద్వారా ఏ.టి.యం కార్డు లేకుండానే రోజుకు 20 వేల రూపాయలు నగదును డ్రా చేసుకునే సదుపాయం ఉందన్నారు. యాప్ పొందిన వారు ఆన్ లైన్ ద్వారా బస్సు, ట్రైన్, విమాన టిక్కెట్లను అవలీలగా బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. చెక్ బుక్ రిక్వెస్ట్, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు, ఇన్సూరెన్సులు, ఆర్.డిలు, ఇన్సూరెన్స్ పాలసీలు పే తదితరాలను బ్యాంకుకు రాకుండానే పనులను చక్కదిద్దుకునే అవకాశాలున్నాయని, ప్రతి ఒక్కరూ ఈ సదుపాయమును సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహనా సదస్సులో వింజమూరు స్టేట్ బ్యాంకు శాఖ మాజీ నగదు అధికారి వల్లూరుపల్లి.కోటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు..