జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు

విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద గల జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్, తూర్పు ఇంచార్జ్ బత్తిన రాము, మైలవరం ఇంచార్జ్ అక్కల గాంధీ మరియు అంజిబాబు  గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ  జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని గాంధీజీ అహింస వాది మాత్రమే కాదని ,వారు గొప్ప ప్రకృతి ఆరాధ్యులు అని, తన చుట్టూ ఉండే పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే లాగా చర్యలు తీసుకునే వారని, మహాత్మాగాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాత అని సత్యం, అహింసా మార్గం ఎంచుకున్న గొప్ప వ్యక్తి అని శాంతిమార్గం అత్యున్నత మార్గమని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని నేటి యువత మహాత్మా గాంధీ  జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలు అక్రమాలపై గాంధీ గారు సూచించిన సత్యాగ్రహ మార్గం ద్వారా పోరాటం చేయాలని సూచించారు.