ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తులుగా తండ్రీ కొడుకులు చరిత్రలో  నిల్చిపోయారు

04.10.2019
అమరావతి


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖమంత్రి  శ్రీ  పేర్ని( నాని) వెంకట్రామయ్య.


ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తులుగా తండ్రీ కొడుకులు చరిత్రలో  నిల్చిపోయారు ః రవాణాశాఖ మంత్రి పేర్ని నాని. 


నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఎవరన్నారు. మాటలు నేర్వటం ఒక వరమైతే మాట ఇవ్వటం ఒక సాహసం. మాట ఇవ్వటం ఒక సాహసం అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం అనేది ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వాన్ని, ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబెట్టుకునే వ్యక్తులుగా దివంతగ నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన తనయుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిల్చిపోయారని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పశ్చమ గోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమం సందర్భంగా  ఆనాడు తండ్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఒక అడుగు వేస్తే నేడు కొడుకు జగన్మోహన్‌ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడుగా రెండడుగులు ముందుకు వేసి మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.  సాధారణంగా రాజకీయ నాయకులు మనుషులు కనబడితే మాటలు చెప్పుకుంటా పోతాం. కానీ జగన్మోహన్‌ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయ నాయకుల మాటకు విలువేంటో ఈప్రజలకు రుచి చూపించినటువంటి దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నానన్నారు.  నాడు మే 14  2018 సంవత్సరంలో ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్లో వ్యాన్‌ మీద నిలబడి ఆటో కార్మికులు ఆటో తోలుతూ తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట అంటిన కాకీ చొక్కాని జగన్మోహన్‌ రెడ్డి గారికి ఇచ్చి అన్నా ఒక్కసారి వేసుకో అని చెప్పినప్పుడు ఆ చొక్కా  ఆయన వంటి మీద వేసుకున్నప్పుడు మీ చెమట సువాసన అతనికంటి మీరు చెప్పిన ప్రతీ మాట, ప్రతీ కష్టం విని ఆ రోజు మీ అందరి ఆటో కార్మికులకు ఇచ్చిన మాట ఇవాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,73,102 ఆటో కార్మికులకు లబ్ది చేకూరే విధంగా నాంది పలికారన్నారు.  సాధారణంగా గత ప్రభుత్వాలని మనం చూశాం. ప్రజలకిచ్చేటటు వంటి పథకాలన్నీ ఎలా తయారవుతాయి. నలుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్‌  అధికారులు ఒక ఏసీ గదిలో కూర్చొని ఏ పథకం చేస్తే ఎలా ఉంటుంది ఏ పధకాన్ని జనాలకిస్తే మనం తిరిగి ఓట్లు రాబట్టడానికి అవకాశం ఉంటుందా అని ఆలోచన చేస్తారు. అలాపెట్టిన పథకాలెన్నో  మనం చూశామని,  కానీ చరిత్రను తిరగరాస్తూ రాజకీయాల కోసం పథకాలనే దాన్ని  మార్చి ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమై తన పాదయాత్ర ద్వారా ప్రజల చెప్పిన కష్టాలను విని  ప్రజలమధ్యనే రోడ్డు మీదే మీ అందరి సమక్షంలో దానికి పరిష్కార మార్గాలను, పథక నిర్ధేశాన్ని రచించినటువంచి మహనీయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని ప్రశంసించారు. ఇవాళ జగన్మోహన్‌ రెడ్డి రచించిన ప్రతీ పథకం గదిలో కూర్చుని, లేదా ఓట్ల కోసం రచించినటు వంటి పధకాలు ఏవీ కావని, ప్రజల మధ్యన ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3500 పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి 14 మాసాలు రోడ్ల మీద ఎండనక, వాననక, చలనక మన మధ్యే తిరుగుతూ మన కోసం మన కష్టాలు వింటూ ఎక్కడికక్కడ సమస్యలనే పథకాలుగా రూపకల్పన చేశారన్నారు. అలామాట ఇచ్చి ఈ రోజున ఆ మాట నిలుపుకునే ప్రయత్నంలో జగన్మోహన్‌ రెడ్డి గారు  ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో తొలి పథకం  ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్మోహన్‌ రెడ్డి గారి మొదటి పథకం ఆచరణ నా డిపార్ట్‌ మెంట్‌ ద్వారా అమలు కావడం  నా అదృష్టమన్నారు. మీ అందరికీ  ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆటో వాళ్లను, టాక్సీ వాళ్లను డ్రైవర్లను ఇబ్బంది పెడుతుందనే పేరుంది.  డ్రైవర్లని ఆ ఫైన్‌ ఈ ఫైన్‌ పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం కొత్త బళ్లు అమ్మితే టాక్స్‌లు వసూలు చేయడం ఇలాంటి డబ్బులు గుంజేటటు వంటి డిపార్ట్‌మెంట్‌గా మాకు పేరుంటే  మొట్టమొదటి సారిగా భారత దేశ చరిత్రలో డబ్బులు వసూలు చేయడమే ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పని అనుకున్నప్పుడు... కాదు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ డబ్బులిచ్చే డిపార్ట్‌మెంట్‌గా మార్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డి గారికే భారత దేశ చరిత్రలో దక్కిందని మీ అందరి సమక్షంలో గర్వంగా చెపుతున్నానన్నారు.  గతంలో కూడా మనం ఒక ప్రభుత్వాన్ని చూశాం. 40 యేళ్ల ఇండస్ట్రీ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వమది. ఆ  40 యేళ్ల ఇండస్ట్రీ ప్రభుత్వం 600 ఎన్నికల హామీలిచ్చి ఆ ఎన్నికల హామీలని అమలు చేయమని అడిగితే ఏం చేస్తాం తమ్ముళ్లూ కట్టుబట్టలతో అర్దరాత్రి తోలేశారు. డబ్బుల్లేవ్‌. ఖజానా కాలీగా ఉంది. అంటూ అబద్దాలు చెపుతూ కాలం గడిపారు. కానీ ఇవాళ మీ అందరి ప్రేమతో, మీ అందరి మద్ధతుతో, దేవుడు దయతో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి యాభై శాతం ఓటు మెజార్టీతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే.. మీరు అప్పగించినటువంటి ఈ ప్రభుత్వానికి... నలభై యేళ్ల ఇండస్ట్రీ ఏ ప్రభుత్వం గోతులు, గుంతలు కాకుండా ఏకంగా పెద్ద అగాధాలు, పెద, పెద్ద ప్రొక్లెయిన్లు వెళ్లిపోయినా కూడా ఆ గోతుల్లో కనపడిన విధంగా ఖజానాను లూఠీ చే సిందన్నారు. అయితే అనేక ఆర్ధిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా నాలాంటి చాలా మంది మంత్రులం కలిసి  చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతున్నా.. డబ్బులు లేవని చెపుతున్నా, ముఖ్యమంత్రి  వెనక్కి తగ్గలేదన్నారు. మనకు ఐదేళ్లు  టైం ఉందని చెపుతున్నా, అప్పుడే తొందరెందుకు జగన్మోహన్‌ రెడ్డి గారు అని మా లాంటి మంత్రులం లాగుతున్నా సరే . మా చేతులను విదిలించి ఏదైతే తను మాట చెప్పారో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారని చెప్పారు. డబ్బుదేముంది మన ఆలోచనల్లో.  మనసులో మంచి చేయాలని  ఆలోచన ఉండాలని, చేసే లక్ష్యం ఉండాలని...పైన భగవంతుడున్నాడు. కచ్చితంగా మనకు అన్నీ సమకూర్చుతాడు అని సీఎం అన్నారని చెప్పారు. అన్ని ఆర్ధిక బాధలున్నా పక్కనబెట్టి ఈ రోజున ఆటో కార్మికులకు పదివేల రూపాయలిచ్చే కార్యక్రమాన్ని మొదటగా మొదలుపెట్టినందుకు ఇది మన ఆటోకార్మికులందిరికీ కూడా అదృష్టమన్నారు. మొదటి పథకంగా మన శాఖకే ఇచ్చినందుకు జగన్మోహన్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మన ఆటో డ్రైవర్ల  కష్టాలు అన్నీ మనకు తెలుసు. మనం రోజూ ఇంట్లోంటి బయటకి వచ్చి తాళం తిప్పి కింద నుంచి హేండిల్‌ లాగో సెల్ఫ్‌ స్టార్ట్‌ చేసో రోడ్డుమీదకు రాగానే ఏ పోలీసాయన ఆపుతాడో , ఏ రాంగ్‌ రూట్‌ అంటాడో  రాంగ్‌ పార్కింగ్‌ అంటాడో ఎక్కడ బ్రేక్‌ ఇన్సె ్ఫక్టర్‌ వచ్చి ఫైన్‌ రాస్తాడేమోనని బిక్కు బిక్కుమంటూ తోలతా ఉంటామని,  దూరంగా సైగలు చేసుకుంటూ పైన పోలీసాయన ఉన్నాడంటూ గబాలున సంధుల్లో తిప్పుతింటాం అని మంత్రి ఆటో డ్రైవర్ల సాధకబాధకాలను చెప్పుకొచ్చారు. అయితే  ఇవన్నీ చట్టాన్ని అతిక్రమించాలని, చట్టాన్ని మీరి చేయాలని కాదని, జీవనం గడవటానికి ఇబ్బందిగా ఉన్న పరిస్ధితులేనన్నారు. ఆర్ధిక పరిస్ధితులను గట్టెక్కడానికి ఆటో తోలుతూ  ఆ కష్టాల్లో ఈ ఫైన్లు కట్టుకోలేక ఈ బాధాకరమైన పరిస్ధితులు ఉన్నాయని, దాని కోసమే  జగన్మోహన్‌ రెడ్డి గారు మన ఈతి బాధలు తీర్చడానికే వైయస్సార్‌ వాహనమిత్ర ఇవాళ ప్రారంభించారన్నారు. ఈ పధకం ఆటో డ్రైవర్ల జీవితాలను పూర్తిగా ఉర్ధరించకపోయినా.. చన్నీళ్లకు వేడినీళ్ల తోడైనట్లు వారికి ఉపయోగపడతాయన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్‌ రెడ్డి శిష్యులేనని, ఆయనలా ప్రజా సేవ చేస్తున్న వారేనన్నారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ గారు ఇప్పుడు ఒక బటన్‌ నొక్కగానే మీ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయని.... మీ అందరికీ మెసేజ్‌లు కూడా వెళ్తాయన్నారు. ఆ డబ్బులతో ఆటోలన్నీ కూడా చిన్న, చిన్న రిపేర్లు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు వాహనాలకు కచ్చితంగా ఇన్సూ్య రెన్స్‌ చేయించాలని సూచించారు. దానివల్ల పాసింజర్స్‌ తో పాటు ఆటో డ్రైవర్ల బతుకులు కూడా క్షేమంగా ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ గారు డబ్బులివ్వగానే ట్రాన్స్‌పోర్ట్‌ మంత్రి వీడి ఆదాయం కోసం ఇన్సూ్య రెన్స్‌ చేయించండి అంటున్నారని భావించొద్దంటూ చలోక్తులు విసిరారు. ఇది వరకు సినిమాల్లో చెప్పినట్లు ఆటో డ్రైవర్లు ఒక దెబ్బకు పదిమందిని లేపేస్తున్నారని డైలాగ్‌ చెప్పినట్లు జరగకూడదని... అటువంటి స్ధితి నుంచి ఆటో యాక్సిడెంట్లు తగ్గించుకుంటూ వచ్చారని  మరింత జాగ్రత్తగా ఉండాని, దాన్ని సున్నా శాతానికి తీసుకెల్లి ఆటోల వల్ల ప్రమాదాలు జరగవు అనే స్ధితికి చేరాలన్నారు. మరోవైపు ప్రంట్‌ సీటులో పాసింజర్‌ని ఎక్కించకండి అని విజ్ఞప్తి చేశారు. అలాగే జగన్‌ గారి శిష్యులుగా మీరు కూడా ప్రజా సేవకులే కాబట్టి ఎక్కడన్నా గర్బిణీలు, వికలాంగులు కనిపిస్తే ఉచిత రీతిన సేవ చేయాలన్నారు. మరోవైపు వైయ్సార్‌ వాహనమిత్ర కార్యక్రమం ఇంత గొప్ప విజయవంతమవడం కోసం కృషి చేసిన రవాణా శాఖ అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image