విశాఖకు రానున్న గవర్నర్
విశాఖపట్నం : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నగరానికి రానున్నారు. ఉదయం గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 10:50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి బయల్దేరి హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా సాలూరు వెళతారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళతారు. రాత్రి 8:20 గంటలకు సర్క్యూట్ హౌస్ నుంచి బయల్దేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని విమానంలో గన్నవరం పయనం అవుతారు.
విశాఖకు రానున్న గవర్నర్