పంచాయితీ అద్దె గదుల బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు :ఇంచార్జ్ ఇ.ఓ శ్రీనివాసులు రెడ్డి

*పంచాయితీ అద్దె గదుల బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు :ఇంచార్జ్ ఇ.ఓ శ్రీనివాసులు రెడ్డి


వింజమూరు: వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ అద్దె గదుల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని వింజమూరు ఇంచార్జ్ పంచాయితీ కార్య నిర్వహణాధికారి బంకా. శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం పంచాయితీ అద్దె గదులు పొందిన దుకాణా దారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018 - 2019 ఆర్ధిక సంవత్సరానికి గానూ పంచాయితీకి సంబంధించిన 20 అద్దె గదులకు దుకాణా దారులు 15 లక్షల రూపాయల మేర బకాయిలు ఉన్నారని పేర్కొన్నారు. పంచాయితీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బకాయిల వసూళ్ళను వేగవంతం చేస్తున్నామన్నారు. తక్షణమే అద్దె గదుల బకాయిలను చెల్లించాలని ఆయన దుకాణా దారులను కోరారు. పంచాయితీ అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు పన్నుల వసూళ్ళలో కూడా కఠిన తరమైన నిబమంధనలను అవలంభించనున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి స్వరూపారాణి, ఇ.ఓ.పి.ఆర్.డి ఉషారాణి, మాజీ సర్పంచ్ గణపం. బాలక్రిష్ణారెడ్డి, పంచాయితీ సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.