వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకంపై వాలంటీర్లకు అవగాహన

వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకంపై వాలంటీర్లకు అవగాహన


వింజమూరు:


పేద, నిరుపేద వర్గాలకు చెందిన ప్రజలు సభ్యులుగా ఉండే స్వయం సహాయక గ్రూపుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై వాలంటీర్లు అవగాహన కలిగి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని వెలుగు కమ్యూనిటీ కో- ఆర్డినేటర్ వెంకట రమణమ్మ కోరారు. శుక్రవారం వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణలోని వెలుగు భవన సముదాయంలో వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకం తీరు తెన్నులపై వాలంటీర్లకు అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ రత్నాల పధకంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల సాధికారితకు, ఆర్ధిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ పధకమును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను మరింతగా ప్రోత్సహించడంతో పాటు అప్పులను సక్రమంగా చెల్లించుట ద్వారా సంఘాలపై గత బ్యాంకు రుణ భారాన్ని తగ్గించవచ్చునన్నారు. తద్వారా ప్రభుత్వం నూతనంగా అందజేయనున్న వై.యస్.ఆర్ '0' వడ్డీ పధకమును పేదల దరి చేర్చి వారికి ప్రభుత్వ ఫలాలను అందించి ఆర్ధికంగా చేయూతనిచ్చే దిశగా కృషి చేయాలని వెంకట రమణమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.