ఆ తీర్పును అందరూ స్వాగతించారు: కిషన్‌రెడ్డి

ఆ తీర్పును అందరూ స్వాగతించారు: కిషన్‌రెడ్డి
విశాఖపట్నం: వచ్చే ఏడాది భారత్‌లో 'నో మనీ ఫర్ టెర్రర్' మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ హోం మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... 'ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు' అనే నినాదంతో మెల్‌బోర్న్‌లో సమావేశం జరిగిందని తెలిపారు. 71 దేశాలకు చెందిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఉగ్రవాదులకు సహాయం చేసే బ్యాంకులేవైనా సరే వాటిపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్‌ తీరును ఆయన ప్రస్తావించారు. 'పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి డ్రగ్స్‌ విక్రయించి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుంది. దొంగ నోట్లను కూడా ముద్రించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
తీర్పును అందరూ స్వాగతించారు : నరేంద్ర మోదీ ప్రభుత్వం 'సబ్ కె సాథ్ సబ్ కె విశ్వాస్' పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. అన్నివర్గాల ప్రజలు విశ్వాసం పొందుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. 'కాంగ్రెస్ సుస్థిరమైన పాలన అందించలేకపోయింది. ఏనాడు కూడా ప్రజల ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రామజన్మ భూమి అంశం పట్ల కేంద్రం తన వైఖరిని, ప్రతిపాదనను ధైర్యంగా సుప్రీంకోర్టు ముందుంచింది. అయోధ్య అంశంపై తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయి' అని పేర్కొన్నారు. అదే విధంగా అభివృద్ధి సాధించే దిశగా కేంద్రం గట్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఆహార భద్రత, విద్యాహక్కును సమర్థవంతగా అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు.
శివసేన మోసం చేసింది : 'మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సివచ్చింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే శివసేన మోసం చేసింది. నిజానికి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఉండేది' అని కిషన్‌రెడ్డి మహా రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 'స్కూళ్ళు తెరిచాం, పర్యాటకులను అనుమతించాం. 90 శాతం జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కేవలం18 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఉంద'ని చెప్పారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు