27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
అమరావతి : ఈ నెల 27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అంతేకాకుండా అసెంబ్లీలో తీసుకురానున్న కీలక బిల్లులపై నిశితంగా కేబినెట్ చర్చించనుంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం చర్చించనున్నది. రాష్ట్రంలో మైనింగ్ లీజుల రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. ఇసుక వారోత్సవాలు, రాజధానిలో చంద్రబాబు పర్యటనపై చర్చించే అవకాశం ఉంది.
27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం