నెల్లూరు లో ఘనంగా జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు

*నెల్లూరు లో ఘనంగా జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు*
*ఏపీఈజేయూ, ఏపీజేఎఫ్ నేతలకు సన్మానం*


జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని కరెంటు ఆఫీస్ వద్ద గల జాప్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాప్ రూపొందించిన 27వ వార్షికోత్సవ కేక్ ను ముఖ్యఆతిధులుగా విచ్చేసిన జాప్ రాష్ట్ర కోశాధికారి పాశం ఏడుకొండలు, ఏపీఈజేయూ జిల్లా అధ్యక్షులు ఉడతా రామకృష్ణ, ఎపిజేఎఫ్ జిల్లా కన్వీనర్ ఎస్. శ్రీనివాసులు, కో కన్వీనర్ మల్లు రాజేంద్రప్రసాద్ కట్ చేశారు. అనంతరం జాప్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్యర్యంలో
ముఖ్య అతిధులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జాప్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులకు చేదోడుగా ఉంటూ, వారికి అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ జర్నలిస్టుల కోసం నిత్యం తపన పడే వ్యక్తులను సన్మాన గ్రహీతగా ఎంచుకోవడం జరిగిందన్నారు. "సదా మీ కోసం" దిన పత్రిక ఎడిటర్, ఏపీఈజేయూ జిల్లా అధ్యక్షుడు ఉడతా రామకృష్ణను ప్రత్యేకంగా సత్కరించడం జరిగిందన్నారు. అంతేకాక వివాదరహితుడైన అభయం దిన పత్రిక ఎడిటర్ ఎస్.శ్రీనివాసులును జాప్ తరపున సత్కరించటం గర్వంగా ఉందని జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోవుకాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు జర్నలిస్టు సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన ఆకాంక్షించారు.  జాప్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వార్షికోత్సవం జరుపుకొంటున్నదని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు రేబాల కోటేశ్వరరావు, ఆరి రోహిత్ కృష్ణ,  కొలపర్తి హజరత్తయ్య, ఎస్కే న్యూస్ ఎడిటర్ షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.