సమిష్టిగా టి.డి.పి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవాలి:బీదా

*సమిష్టిగా టి.డి.పి సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవాలి* 


తెదేపా జిల్లా అధ్యక్షులు బీదా.రవిచంద్ర


కలిగిరి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన సంస్థాగత ఎన్నికలను పార్టీ శ్రేణులు సమిష్టిగా నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బీదా.రవిచంద్ర అన్నారు. ఆదివారం ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలోని టి.డి.పి క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన టి.డి.పి శ్రేణుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టి.డి.పి అధినేత పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కమిటీలలో ప్రధానంగా యువతకు పెద్దపీట వేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. 33 శాతం కమిటీలలో 35 సంవత్సరాలు లోపు వయసు కలిగిన వారిని నియమించాలన్నారు. ప్రతి 10 మందిలో ముగ్గురు మహిళలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. కమిటీల ఏర్పాటులో ఖచ్చితమైన నిబంధనలను పాటించిన పక్షంలో పార్టీ బలీయమైన శక్తిగా అవతరించనున్నదని స్పష్టం చేశారు. వై.సి.పి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంధులకు గురిచేయడం తప్ప వారు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు జీవన భృతి కొల్పోయి కుటుంబాలకు కుటుంబాలే పస్తులుండాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడటం శోచనీయమన్నారు. ప్రజా వేదికను కూల్చి మహాపాపం మూటగట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అధికారులు బయ భ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో ఏ యం.యల్.ఏ కూడా చేయని విధంగా బొల్లినేని.వెంకటరామారావు దాదాపుగా 3 వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. రాజ�