వింజమూరులో 8 న జీ.బీ.కే.ఆర్ అధ్వర్యంలో కార్తీక వన భోజనాలు

వింజమూరులో 8 న జీ.బీ.కే.ఆర్ అధ్వర్యంలో కార్తీక వన భోజనాలు


వింజమూరు: వింజమూరుకు నైరుతి దిక్కున కొండ వద్ద వెలసియున్న శ్రీ వింధ్య పరమేశ్వరి అమ్మవారి సన్నిధానం వద్ద కార్తీక వన భోజనాలకు ఏర్పాట్లు చేసినట్లు వింజమూరు మాజీ మండలాధ్యక్షులు, మాజీ సర్పంచ్ గణపం. బాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి మాజీ జడ్.పి.టి.సి, మాజీ సర్పంచ్ గణపం. సుజాతమ్మ, ఆయన తనయుడు మాజీ మండలాధ్యక్షులు గణపం. క్రిష్ణకిరణ్ రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా గణపం. బాలక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రతతో కూడుకుందన్నారు. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో పరమ శివుని ఆరాధిస్తుంటారన్నారు.  కార్తీక వన భోజనాలను ప్రతి యేడాది నిర్వహిస్తుంటామని అన్నారు. ఈ దఫా మా పిన తండ్రి గణపం. ఓబులురెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి పద్మావతమ్మ సౌజన్యంతో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కనుక ప్రజలు, భక్తులు ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్ధ ప్రసాదములను స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని బాలక్రిష్ణారెడ్డి కోరారు..