విధానం చాలా దుర్మార్గం :పోతిన మహేష్

భవన నిర్మాణ కార్మికులకు, సామాన్య ప్రజానీకానికి ఈ ప్రభుత్వంలో ఇసుక కష్టాలు తప్పవని మన ముఖ్యమంత్రి  ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రముఖ దినపత్రికలలో పూర్తి పేజీలో వివరించిన విధానం చాలా దుర్మార్గం అని  జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుండి విడుదల చేసిన  పత్రికా ప్రకటన లో ఇసుక పై ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు విధానం పై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వo  ఇసుక మాఫియా కి, దోపిడీ విధానానికి మద్దతు పలికే విధంగా నేడు జగన్ మోహన్ రెడ్డి గారి  చిత్రపటంతో విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన ఉందని,  13 జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో టన్ను  ఇసుక రేటును  ప్రభుత్వం ప్రకటించిన ధరలతో పోల్చితై ఒక ట్రాక్టర్ ధర నాలుగు వేల రూపాయలుకు, ఒక లారీ ధర 18 వేల రూపాయలకు  అందుబాటులో ఉంటుందని ప్రకటించడం వలన ఎవ్వరికి ఇసుకను అందుబాటులో ఉంచకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయం లా ఉందని కార్మికుల ప్రజల కష్టాలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయై పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి అని CM జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకాక తప్పుడు నిర్ణయాలు విధానాలతో వారి వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని   ఎవరన్నా ప్రజలకి మంచి చేసి ప్రకటనలు ఇచ్చికుంటారు కానీ, ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రకటనలు ఇచ్చుకోవడం మూర్ఖత్వం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కష్టాల మీద కార్మికుల ఇబ్బందులు మీద రాష్ట్ర అభివృద్ధి  మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే టన్ను ఇసుక రేటు ను వంద రూపాయలకు అందజేయాలని మహేష్ డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు ఎక్కువయ్యాయని గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముందు గంజాయ్ అమ్మ అమ్మకం చేసే వారి పైన అదేవిధంగా గంజాయి సేవించి ఇబ్బందులు కలిగిస్తున్నా వారి మీద పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని,వన్ టౌన్ ప్రాంతవాసులు లో బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అనునిత్యం అక్కడ  ట్రాఫిక్ స్తంభించి పోవడం, రోడ్లపై పెద్దపెద్ద గోతులు ఉండడం, చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి పోవడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై  పోలీస్ శాఖ వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని మహేష్ కోరారు.