ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేసిన APMWO..

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు వ్యక్తం చేసిన APMWO..



కడప. నవంబర్ 21, (అంతిమతీర్పు) :                 నగరంలోని ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు తన్వీర్ అహ్మద్ షేక్  విలేఖరుల సమావేశం నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లింల డిమాండ్లను నెరవేర్చాలని శాంతియుతంగా ప్లేకార్డుల ద్వారా నిరసన తెలిపిన నంద్యాలకు చెందిన 9 మంది యువకులను అరెస్టు చేసి దేశద్రోహం కేసులు పెట్టి వేధించారు. గత ఎన్నికల్లో అఖండ విజయంతో రాష్ట్రంలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నేడు వారిపై కొనసాగుతున్న కేసులను ఉపసంహరిస్తూ ఏ.పి ప్రభుత్వం G.O.R.T: 988 విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా గారికి అభినందనలతో కృతజ్ఞతలు తెలుపుతూ గత ప్రభుత్వం ఈ తొమ్మిది మంది యువకులను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా ఎంతో మనోవేదనకు గురైన వీరిని ప్రభుత్వం తరఫున జీవనోపాధి కొరకు సహాయ సహకారాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్నీ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ షబ్బీర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఫ్వాన్ బాషా, కడప జిల్లా అధ్యక్షులు షఫీఉల్లా ఖాన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.