అయ్యప్పలకు అచ్చిరెడ్డి దంపతుల అన్నదానం

*అయ్యప్పలకు అచ్చిరెడ్డి దంపతుల అన్నదానం* వింజమూరు: వింజమూరులోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం 18 వ రోజు సందర్భంగా వెన్నపూస.అచ్చిరెడ్డి-మల్లీశ్వరి దంపతులు మనుమడు ఖుషివర్ధన్ రెడ్డి జన్మదినోత్సవమును పురస్కరించుకుని అయ్యప్ప, గోవింద నామ మాలధారణ భక్తులకు అన్నదానం చేశారు. కార్తీక మాసం ఆరంభం నుండి మాసాంతం ఈ దేవస్థానంలో నిరంతర అన్నదాన కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినంచదగిన విషయమని శ్రీ హరిహర పుత్ర దేవస్థానం ప్రధాన నిర్వాహకులు, గురుస్వామి చేబ్రోలు. వసంతరావు పేర్కొన్నారు. మణికంఠ స్వామి కృపా కటాక్షములు అన్నదాతలకు, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని ఆయన ఆకాం క్షించారు. అనంతరం మాలధారణ భక్తులకు, అన్నదాత కుటుంబ సభ్యులకు అయ్యప్పస్వామి శరణు ఘోషల నడుమ స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఏ.సి.డి.సి ప్రసాద్, చిట్టమూరి.హరీష్, శేగు.పూర్ణచంద్రరావు, వెలుగోటి.క్రిష్ణ, బొగ్గల.మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు......