ఇసుక సరఫరా పెంపుపై సీఎం వైయస్‌.జగన్‌ కీలక సమావేశం

06–11–2019
అమరావతి
అమరావతి: ఇసుక సరఫరా పెంపుపై సీఎం వైయస్‌.జగన్‌ కీలక సమావేశం
సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పోలీసు అధికారులు రవిశంకర్‌ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు
సమావేశంలో కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం


*ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు ప్రకటించిన సీఎం*
ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం వైయస్‌.జగన్‌ నిర్ణయం
ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం
ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధంచేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు
ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకు రండి:
ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులకు ఆదేశాలు
రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలి:
నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలి:
నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలి:
ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలి:


అలాగే ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను పెట్టాలి:
ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలి:
ఒక్క రవ్వకూడా అవినీతికి తావులేకుండా చేస్తున్నాం, అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నాం:
ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారు, అయినా సరే బండలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు:
వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలి:
వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తాం:
స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తాం:


సరిహద్దుల్లో నిఘాను పెంచండి: సీఎం
ఎట్టిపరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ చేయకూడదు:
టెక్నాలజీని వాడుకోండి:
స్మగ్లింగ్‌ జరిగితే చెడ్డపేరు వస్తుంది:
చెక్‌పోస్టుల్లో టీంలను పెంచుతామన్న అధికారులు
మొబైల్‌ టీంలను పెంచుతామన్న అ«ధికారులు
ప్రత్యేక టీంలను కూడా పెంచుతామన్న అధికారులు
చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఉండేందుకు వీలుగా కనీస సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
రెయిడ్స్‌ చేయాలి, కేసులు పెట్టాలి, తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా జైలుకు పంపాలి: సీఎం
ఇది జరిగితే.. కచ్చితంగా పరిస్థితి అదుపులోకి వస్తుంది: సీఎం
ప్రతిరూట్లోనూ చెక్‌ పోస్టు పెట్టాలి: సీఎం


ప్రస్తుతం ఇసుక లభ్యతపై అధికారుల నుంచి వివరాలు కోరిన సీఎం
275 రీచ్‌ల్లో 83 చోట్ల రీచ్‌లు పనిచేస్తున్నాయన్న అధికారులు
పనిచేస్తున్న ఇసుక రీచ్‌ల సంఖ్య 61 రీచ్‌లనుంచి 83 రీచ్‌లకు పెరిగిందన్న అధికారులు 
రోజుకు సరఫరా 41వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 69 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా పెరిగిందన్న అధికారులు
వారంరోజుల్లో లక్ష మెట్రిక్‌ టన్నులకు సరఫరా పెరుగుతుందన్న అధికారులు
వాతావరణం ఇలాగే సహకరిస్తే... 15–30 రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్న అధికారులు
వాతావరణం సహకరించిన వెంటనే 275 రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభిస్తామన్న అధికారులు
రోజుకు 2–3 లక్షల టన్నుల వరకూ ఇసుకను సరఫరా చేయగలుగుతామన్న అధికారులు


275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా?: అధికారులను ప్రశ్నించిన సీఎం
275 రీచ్‌ల్లో ఏం జరుగుతుందనే దానిపై మనం చూడగలగాలి: సీఎం
ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం కలగాలి:
మొత్తం 275 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, మనం లైవ్‌లో చూడగలగాలి
మైనింగ్‌ అధికారులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కంట్రోల్‌ రూంద్వారా చూడగలగాలి:సీఎం
రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలి:


 


వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలి:సీఎం
ప్రతి రీచ్‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి:
ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలి:
కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలి:
ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలి:
అవసరమైతే ఇంకా స్టాక్‌ పాయింట్లు పెంచాలి:
ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలి:
అలాగే రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి: 
ఆలస్యంకాకుండా వేర్వేరు సంస్థలనుంచి సాంకేతిక సహకారం తీసుకోండి:


వరదలన్నవి మన చేతిలో లేవు:
ఆగస్టునుంచి ఇవ్వాళ్టి వరకూ నదుల్లో అలానే వరద కొనసాగుతోంది:
అధికారంలోకి వచ్చి 5నెలలు అయింది: 
మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు, పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి:
5నెలల్లో 3 నెలలు వరదలు వచ్చాయి:
ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి:
ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయి:
మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు:


*మద్యం నియంత్రణపైనా సీఎం సమీక్ష*
గ్రామాల్లో ఎవ్వరైనా లిక్కర్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి:సీఎం
లిక్కర్‌ అమ్మినట్టు ఫిర్యాదు రాగానే కచ్చితంగా జైలుకు పంపాలి:
దీనిపై కూడా టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేయాలి
దీనిపై కూడా చట్టం తీసుకురావాలి: 
దీనిపై విధివిధానాలకు మరో సమావేశం ఏర్పాటు చేయాలన్న సీఎం


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image