ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు

13.11.2019
అమరావతి 


ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు


1.
ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలకు కేబినెట్‌ ఆమోదం
రూ.2 లక్షల వరకూ కనీస జరిమానా, 2 ఏళ్ల వరకూ జైలు శిక్ష
ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్, పునర్వివిక్రయాలపై ఉక్కుపాదం మోపాలని కేబినెట్‌ నిర్ణయం
ఇసుక విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకుకేబినెట్‌ ఆమోదం
ఉల్లంఘనలకు పాల్పడిన వారికి  గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు  రూ.2లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ గనులచట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం
ఇసుక లభ్యతను మరింతగా పెంచడానికి వారోత్సవాలు చేస్తున్నాం: సీఎం
రేపటి నుంచి (నవంబర్‌ 14 నుంచి) వారోత్సవాలు : సీఎం
రోజుకు 2 లక్షల టన్నుల వరకూ ఇసుక సరఫరా: సీఎం
వచ్చే 10 రోజుల్లో ఇప్పటివరకూ ఉన్న కొరతను పూర్తిగా తీరుస్తాం: సీఎం


2. 
కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజిమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు  కేబినెట్‌ ఆమోదం 
పారిశ్రామిక వ్యర్ధాలతో పాటు ఇతర వ్యర్ధాల సేకరణ, రవాణా, నిల్వ, శుద్ది నిర్వహణపై పనిచేయనున్న ఏపిఈఎంసి
రాష్ట్రంలో 9వేల పరిశ్రమలు
ఇందులో 2వేల పరిశ్రమలు రెడ్‌ కేటగిరీలో
2683 పరిశ్రమల  నుంచి ఏడాదికి 5,56,317 టన్నుల వ్యర్థాలు
ఇందులో 2,11,440 టన్నులు డిస్పోజబుల్‌ వేస్ట్‌
3,13,217 టన్నులు రీసైక్లబుల్‌ వేస్ట్‌
31,659 టన్నులు ఇన్‌క్రెడిబుల్‌ వేస్ట్‌
196.3 ఎంఎల్‌డీ కలుషిత జలాలు
రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థీకృతంగా లేదని గుర్తించిన ప్రభుత్వం
విడుదలవుతున్న వ్యర్థాలను, కలుషిత జలాలను శుద్ధిచేసేందుకు తగిన వ్యవస్థ అవసరమని గుర్తించిన ప్రభుత్వం
వ్యర్థాలకు కారుకులైన వారు బాధ్యత వహించడంలో లోపాలను నివారించడానికి, 
అక్రమంగా పారిశ్రామిక వ్యర్థాలను డిస్పోజ్‌ చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టడానికి,
వ్యర్థాలను తీసుకెళ్తున్న వాహనాలను సరిగ్గా ట్రాక్‌ చేయడానికి
ఒక పరిశ్రమ పేరుతో వ్యర్థాలను సేకరించి, మరో పరిశ్రమ పేరుతో డిస్పోజ్‌ చేయడాన్ని నివారించడానికి, 
రికార్డుల్లో చెప్పినదానికన్నా ఎక్కువ మొత్తం వ్యర్థాలను డెలివరీ చేయడాన్ని అడ్డుకోవడానికి,
పరిశ్రమల్లో విడుదలవుతున్న వ్యర్థాల పరిమాణాల నిర్ధారణకు సరైన  ప్రయోగశాలలు ఉండేలా చూడ్డానికీ
పై అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజిమెంట్‌ కార్పొరేషన్‌ డీల్‌చేస్తుంది



3. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధనకు కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం
ముఖ్యమంత్రి నిర్ణయానికి ముక్తకంఠంతో ఆమోదం తెలిపిన మంత్రివర్గం
వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు
మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ, ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనకోసం తల్లిదండ్రులనుంచి, ఉపాధ్యాయులు, ఇతర మేధావులనుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చిందన్న మంత్రివర్గం
తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటున్నారని, దీనివల్లే ప్రై వేటు విద్యాసంస్థల్లో ఏటా ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతోందన్న మంత్రివర్గం
ప్రైవేటు విద్యాసంస్థల్లో 98.5శాతం ఇంగ్లిషు మీడియంలోనే చదువుతున్నారని వెల్లడి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటినుంచి 10 వ తరగతి వరకూ 37.21 లక్షల మంది చదువుతుంటే... ఇందులో 3265 సక్సెస్‌ హైస్కూల్లో సమాంతరంగా ఇంగ్లిషుమీడియంలో విద్యా బోధన జరుగుతోందని, 11,37,043 మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారన్న కేబినెట్‌
ప్రస్తుతం ప్రై వేటు విద్యా సంస్ధల్లో 98.5 శాతం స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో ఉండగా.. ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 34 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిషు మీడియం ఉంది.


4.  
నవరత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రణాళికలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఇచ్చిన మరో హామీ అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
సముద్రంలో వేటకి వెళ్లి ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణిస్తే ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా పెంపునకు కేబినెట్‌ ఆమోదముద్ర
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పరిహారాన్ని పెంచుతూ నిర్ణయం
18 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపు కలవారై వైయస్సార్‌ భీమా పధకం కింద నమోదు చేసుకున్న వారికి ఈ పధకం వర్తింపు 
4,05,357 మందికి వర్తింపు 
''వైయస్సార్‌ మత్స్యకార భరోసా'' కింద ఈ పధకం అమలు 
నవంబరు 21న ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న వైయస్సార్‌ మత్స్యకార భరోసా


5. 
పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అనధికారిక లేఔట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు –2019కు మంత్రివర్గ ఆమోదం
గడచిన కొన్ని ఏళ్లుగా గ్రామాలనుంచి నగరాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్లారు
దీనివల్ల నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు ఆనుకుని పెద్ద ఎత్తున ప్లాట్లు వెలిశాయి
వీటిలో చాలావరకు సరైన అనుమతులు లేవు
అనుమతులు లేని కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రై నేజీ, కరెంటు లాంటి మౌలిక వసతులు కల్పించడం కష్టమవుతోంది
తమ ఇబ్బందులు తీర్చమని ప్రజలనుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయన్న మంత్రివర్గం
ఇలాంటి పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ నిబంధనలు –2019కు ఆమోదం 
లేఔట్ల క్రమబద్ధీకరణ వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు కొనుగోలుకు రుణసదుపాయం లభించడం సులభమవుతుంది


6. 
ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ పాలసీ 2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్‌ పవర్‌ పాలసీ –2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్,సోలార్, హైబ్రిడ్‌ పవర్‌ పాలసీ 2018 పాలసీల సవరణకు కేబినెట్‌ ఆమోద ముద్ర 


7.
 రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం –2008కు సవరణకు కేబి¯ð ట్‌ ఆమోదం
వివాదాల సత్వర పరిష్కారానికి 2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ న్యాయాలయాల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించారు.  


8.
 ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణకు కేబినెట్‌ ఆమోదం. 


9.
హోంశాఖలో అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.
1–డైరెక్టర్, 3 డిఎఫ్‌ఓ ర్యాంకుతో అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టుల కొనసాగింపునకు కేబినెట్‌ ఆమోదం


10.
 రాష్ట్రంలోని 8 దేవస్ధానాలకు ట్రస్ట్‌ బోర్డు మెంబర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం
సేవాధక్పధం, ధార్మిక దష్టి, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులను ట్రస్ట్‌ బోర్డు మెంబర్లగా నియామకానికి కేబినెట్‌ నిర్ణయం
 
1). శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం– సింహాచలం 
2). శ్రీ వీరవెంటక సత్యన్నారాయణ స్వామి దేవస్ధానం – అన్నవరం
3). శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్ధానం – ద్వారకా తిరుమల
4). శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం – విజయవాడ
5). శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి దేవస్ధానం – శ్రీకాళహస్తి
6). శ్రీ భ్రమరాంభా మల్లేశ్వరస్వామి దేవస్ధానం– శ్రీశైలం 
7). శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్ధానం – పెనుగంచిప్రోలు
8). శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి దేవస్ధానం– కాణిపాకం
 
11. 
ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ లా చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదముద్ర 


12. 
మొక్కజొన్న ధరలు పడిపోతుండడంపై మంత్రివర్గంలో చర్చ
వారంరోజుల క్రితం క్వింటాలు ధర రూ.2200 ఉండేదన్న వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
వారం రోజుల్లో రూ.1500కు పడిపోయిందన్న వ్యవసాయశాఖ మంత్రి
కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడంలేదని మంత్రివర్గంలో ప్రస్తావించిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు 
రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం
వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ముఖ్యమంత్రి
మార్కెటింగ్‌ శాఖద్వారా రైతులకు నష్టంరాకుండా కొనుగోళ్లు జరపాలన్న సీఎం
సీఎం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఈ మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలుకేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు