పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు పరామర్శ.

పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు పరామర్శ.


హైదరాబాద్:


ఇటీవల అమరావతిలో పిఎసి సమావేశం సందర్భంగా కేశవ్ అనారోగ్యానికి గురయిన విషయం విదితమే. ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లో చేర్పించారు. హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పయ్యావులను సోమవారం ఉదయం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆసుపత్రి వైద్యులను విచారించారు. త్వరితగతిన పయ్యావుల కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.