శ్రీ నేతాజీ స్కూలులో వై.యస్.ఆర్ కంటి వెలుగు*

శ్రీ నేతాజీ స్కూలులో వై.యస్.ఆర్ కంటి వెలుగు*


వింజమూరు: వింజమూరులోని శ్రీ నేతాజీ స్కూలులో డాక్టర్ వై.యస్.ఆర్ కంటి వెలుగు ఫేజ్ 2 కార్యక్రమాన్ని వైధ్యాధికారి హరిక్రిష్ణ నేతృత్వంలో నిర్వహించారు. కంటి వైద్య నిపుణులచే విధ్యార్ధులకు కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధ్యార్ధులలో దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో రెండవ విడతగా కంటి పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన వారికి దృష్టి సమస్యల తీవ్రతను బట్టి మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్ర చికిత్సల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వెంకట సుబ్బయ్య, బీబీజాన్, వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.