ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర ఎస్టీయూ సొంతం

ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర ఎస్టీయూ సొంతం.
ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి-కొండూరు. రమేష్ బాబు.
     ఉపాద్యాయ,విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ఎల్లప్పుడూ ముందుంటుందని,అప్రంటీస్ విధానం రద్దుతోపాటు నేడు ఉపాద్యాయులకు ఉన్న అన్ని రకాల సౌకర్యాల సాధనలో ఎస్టీయూ కృషి ఉన్నదని ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి కొండూరు. రమేష్ బాబు పేర్కొన్నారు.ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎస్టీయూ బాలాయపల్లి మండల శాఖ అద్యక్ష,ప్రధాన కార్యదర్శులు వై.బుచ్చి పోతులూరు,పీ.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన బాలాయపల్లి మండలంలోని బాలాయపల్లి,వెంగమాంబాపురం,జయంపు,పిగిలాం ఉన్నత పాఠశాలలతోపాటు కయ్యూరు, వేణుగోపాలపురం,అరిగేపల్లి, జార్లపాడు, హస్తకావేరి, పాకపూడి తదితర పాఠశాలలలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ డెబ్భై మూడేళ్ళ ఉద్యమ చరిత్రలో అప్రంటీస్ విధానం రద్దుతోపాటు ఉపాద్యాయులకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఎస్టీయూ అనేక పోరాటాలు చేసిందని,విద్యారంగ-ఉపాద్యాయుల సంక్షేమంలో ఎస్టీయూ ఎల్లప్పుడూ ముందుండి  నడిపిస్తుందని తెలిపారు.ప్రభుత్వ శాఖల అన్నింటికీ బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఉపాద్యాయుల బదిలీలను విస్మరించడం తగదని,2018 డియస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని,11వ పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, అమ్మఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింప చేయాలని,గత ప్రభుత్వం జీఓ నంబర్ 21ద్వారా మంజూరు చేసిన మూడు నెలల 20 శాతం మధ్యంతర భృతిని వెంటనే విడుదల చేయాలని, పెండింగులో ఉన్న మూడు విడతల కరువు భత్యాలను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదరు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్టీయూ జిల్లా అద్యక్షులు తాళ్ళూరు. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మాద్యమంతోపాటు తెలుగు మాద్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని,పన్నెండు సంవత్సరాల సర్వీసు కలిగిన ప్రతి సెకండరీ గ్రేట్ ఉపాద్యాయునికి ఆటోమేటిక్ గా స్కూల్ అసిస్టెంట్ గా పధోన్నతి కల్పించాలని, ప్రతి ప్రాధమిక పాఠశాలకు ఒక పీ.ఎస్.హెచ్.ఎం పోస్ట్ మంజూరు చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసభ్యత్వ కార్యక్రమంలో నాయకులు రామమోహన్ రెడ్డి పీ.వీ.రత్నయ్య,సర్వేశ్వరరావు, చెంచురత్నయ్య,సునీల్ తదితరులు పాల్గొన్నారు.