ప్రెస్ అకాడమీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ పాత్రికేయులు శ్రీ దేవి రెడ్డి

ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎసిబి. అంజత్ బాషా.


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ పాత్రికేయులు శ్రీ దేవి రెడ్డి శ్రీనాధ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎసిబి. అంజత్ భాష గారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప ముఖ్యమంత్రి అంజత్ భాష గారు శ్రీనాధ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీనాధ్ రెడ్డి గారితో ఉన్న అనుభవాన్ని నెమరు వేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న  మీడియా మిత్రులకు, వారి నైపుణ్యం పెంచేందుకు ప్రెస్ అకాడమీ మరింత దోహదపడుతుందని ఆకాంక్షించారు.