*03.12.2019* *అమరావతి*
*కళ్లకు కేన్సర్ సోకిన చిన్నారి హేమ ఆనారోగ్యం మీద వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై సీఎం శ్రీ వైయస్.జగన్ స్పందన*
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా
ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నాం : సీఎం
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండి : సీఎం ఆదేశం
చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం : సీఎం
గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స : సీఎం
జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోంది: సీఎం
ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించండి: అధికారులకు సీఎం ఆదేశం
చిన్నారి హేమ కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం