పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష

*అమరావతి*


*పాఠశాల విద్యాశాఖపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష*


*సమీక్షకు హజరైన విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు*


*జగనన్న విద్యా కానుక*


స్టూడెంట్‌ కిట్స్‌
యూనిఫామ్‌ క్లాత్‌ (3 జతలు కుట్టించుకునేందుకు వీలుగా), నోట్‌బుక్స్, షూస్‌ అండ్‌ సాక్స్, బెల్ట్, బ్యాగ్‌కు అదనంగా టెక్ట్స్‌బుక్స్‌ కూడా కలపాలని సీఎం ఆదేశం
కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ పరిశీలించిన సీఎం
కాంపిటీటివ్‌ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్న సీఎం
ఈ ప్రొక్యూర్‌మెంట్, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామన్న అధికారులు
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వద్దు
నాణ్యమైన కిట్స్‌ విద్యార్ధులకు అందాలి
ఎక్కడా జాప్యం జరగకూడదు, అన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలి


*మనబడి నాడు – నేడు*


పాఠశాలల్లో నాడు నేడు పనులు ఎలా జరుగుతున్నాయని అధికారులను ప్రశ్నించిన సీఎం
ప్రతీ చోటా పనులు ప్రారంభమయ్యాయా అని అధికారులను అడిగిన సీఎం
ఎన్ని స్కూల్స్‌లో పనులు ప్రారంభించారని వివరాలు అడిగిన సీఎం
ఇంకా ఎన్ని పాఠశాలల్లో ఇంకా పనులు మొదలు కాలేదని అడిగిన సీఎం, జాప్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలి
అవసరమైతే సీఎంవో అధికారుల సహకారం తీసుకుని పనులు జాప్యం జరగకుండా ముందుకెళ్లండని అధికారులకు సూచన
విద్యార్ధులకు స్కూల్‌ బిల్డింగ్‌ చూడగానే స్కూల్స్‌కి వెళ్ళాలనే విధంగా లైవ్లీగా ఉండాలి
కాంపౌండ్‌ వాల్‌ నుంచి స్కూల్‌ బిల్డింగ్‌ వరకూ వాడే మెటీరియల్ మరింత ఆకర్షణీయంగా ఉండాలి, విద్యార్ధులను ఆకట్టుకునేలా గోడలపై  డ్రాయింగ్స్‌ ఉండాలి


*జగనన్న గోరుముద్ద*


గోరుముద్ద పధకం ప్రవేశపెట్టిన తర్వాత స్కూల్స్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన అధికారులు
విద్యార్ధులకు చిక్కీ కూడా అందుతుందా అని అధికారులను అడిగిన సీఎం, ఇస్తున్నామని చెప్పిన అధికారులు
మానిటరింగ్‌ ఎలా జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన సీఎం
గోరుముద్దపై మొబైల్‌ యాప్‌ సిద్దమవుతుందని సీఎంకి వివరించిన అధికారులు, వెంటనే యాప్‌ సిద్దం చేయాలని ఆదేశం
యాప్‌లో మెనూ వివరాలు ఉండాలి, ఏ రోజు ఏ మెనూ ఇస్తున్నామో యాప్‌లో ఉండాలి
ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియాలి, ఆ తర్వాత వెంటనే సంబంధిత ఉన్నతాధికారి సమస్య పరిష్కరించాలి, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి
మానిటరింగ్‌ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి
ఏ స్కూల్‌లో మెనూ తేడా వచ్చినట్లు ఫిర్యాదు అందగానే వెంటనే పరిష్కరించాలి
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కాబట్టి ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం, అజాగ్రత్త వద్దు, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి
మార్పు అనేది విద్య నుంచే ప్రారంభం కావాలి
స్కూల్స్‌లో శానిటేషన్‌ విషయంలో కూడా పక్కాగా ఉండాలి
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్‌ వివరాలు అధికారులను ఆరా తీసిన సీఎం
టీచర్స్‌ ట్రైనింగ్, కరిక్యులమ్, వర్క్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్‌ విషయంలో అధికారుల పనితీరును అభినందించిన సీఎం
మోరల్స్, ఎధిక్స్‌ అనే క్లాస్‌లు కూడా ఉండాలి, విద్యార్ధులకు ఇవి చాలా ముఖ్యం
డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల వివరాలు అడిగిన సీఎం
మానసిక వికలాంగుల కోసం పులివెందులలో వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా నడుపుతున్న విజేత స్కూల్‌ సక్సెస్‌ స్టోరీ అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
మానసిక వికలాంగుల కోసం పులివెందుల విజేత స్కూల్‌ తరహాలో నియోజకవర్గానికి ఒక స్కూల్‌ ఉండాలి
నాడు నేడు పనుల్లో భాగంగా ఈ స్కూల్స్‌ కూడా ఏర్పాటుచేయండి


నాడు నేడు విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకుని పనిచేయాలని అదేశం, వచ్చే సమీక్షా సమావేశానికల్లా నాడు నేడు పనుల్లో పురోగతి కన్పించేలా అధికారుల చర్యలుండాలన్న సీఎం


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image