లాక్‌డౌన్‌ పాటించి.. కరోనాను ఎదుర్కొందాం : మంత్రి పేర్ని నాని

లాక్‌డౌన్‌ పాటించి.. కరోనాను ఎదుర్కొందాం
మంత్రి పేర్ని నాని
విజయవాడ : కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలని మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌ను తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. ఎంసెట్, ఈసెట్ దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామన్నారు. ఈసెట్‌కు ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో గడువు పెంచామని పేర్కొన్నారు.  కరోనా వైరస్‌ పై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సామాజిక దూరం ద్వారా కరోనాను నియంత్రించవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను పాటించి కరోనాను ఎదుర్కొందామని తెలిపారు. సోషల్‌ మీడియాలో కరోనాపై  వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. తప్పడు ప్రచారాలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా అవసరమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image