ప్రజలు  అర్థం చేసుకోండి

మదనపల్లి, మార్చి 24 : ప్రజలు  అర్థం చేసుకోండి కరోనా ఏ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంటుందని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం  మదనపల్లి పట్టణం నందు మంగళవారం జరిగే వారపు  సంత ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంతలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడం చూసి ప్రజలు ప్రభుత్వం కరోనా వైరస్ పై తీసుకుంటున్న దానికి ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని తెలిపారు.  కరోనా ఏ స్థాయిలో ఉంటే ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని, మన కోసం మన భవిష్యత్తు కోసం, మన ప్రాణాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి నిర్ణయానికి  మనం గౌరవించి ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో ఉండాలని తెలిపారు. ఇంటిలో ఓక్కరు మాత్రమే బయటకు వచ్చి కావలసిన  నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసుకొని వెళ్లాలని  తెలిపారు. ప్రజలు గుంపులుగా ఉండకూడని గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఇతరులకు సోకుతుందని తెలిపారు.  ప్రభుత్వ  సూచనలను తేలికగా తీసుకోవద్దని నిబంధనలు పాటించాలని, అందరూ ఇళ్లకే  పరిమితం కావాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ అందజేసిన కరపత్రాలు ఫ్లెక్సీ ల ద్వారా కరోనా వైరస్ వ్యాధి నుండి ఎలా విముక్తి చెందడం బ్యానర్లు పట్టణం లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని మాస్కులు లేకుండా ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. ప్రజలు గుంపులు గా ఉండడం, గుంపులు గా వెళ్లడం నిషేధించడం జరిగిందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రవి, తహశీల్దార్ సురేష్ బాబు, పట్టణ సి ఐ తమీం అహమద్ , మున్సిపల్ శాఖ, రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు