జర్నలిస్ట్ ల ను ఆదుకోవాలని భూపాలం సతీష్ బాబు లేఖలు

జర్నలిస్ట్ లకు తక్షణం రూ.50 లక్షలు ప్రమాద భీమా, నెలకు రూ. 5000 ఉచిత నగదు, నిత్యావసర వస్తువులు పంపణి చేయాలని డిమాండుతో కూడిన ఒక వినతి పత్రాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్కు అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా తరుపున  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాలం సతీష్బాబు ఇవ్వడం జరిగింది. అలాగే..గౌరవనియులైన రాష్ట్ర ముఖ్య మంత్రికి, సమాచార కమిషనర్ గారికి, గౌరవనియులైన ప్రధానమంత్రికి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గారికి పంపడం జరిగింది. అందులో..జర్నలిస్టులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలాంటి ta, da, salary ఇతరత్రా తీసుకోకుండాను అలాగే ఎవ్వరి సహకారం లేకుండానే ప్రాణాలకు తెగించి covid-19 pi వార్తలు వ్రాస్తున్నారు. ఇప్పటికే 4 స్టేట్స్ లో జర్నలిస్టులకు కరోన సోకిన విషయం తెలిసిందే. మరి వీరి భవిషేత్తు ఎలా?. అన్న ప్రశ్న ఎదురవుతోంది.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇట్లు
భూపాలం సతీష్ బాబు,
అధ్యక్షుడు,
అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా,
ఆంధ్ర ప్రదేశ్.