20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభం


*అమరావతి ,


*మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలు*


*చేపల వేటపై నిషేదం, లాక్‌డౌన్‌తో పనులు కొల్పోయిన మత్స్యకారులు*


*20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభం*


*అర్హులైన ప్రతీ ఒక్క మత్య్సకారుడినీ అదుకునే దిశగా సాయం*


*రూ. 10 వేలు చొప్పున సాయం*


లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేదం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు వీరికి అందజేసే సాయాన్ని రూ. 10 వేలకు పెంచింది. గత నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


*వేట విరామ సాయం గైడ్‌లైన్స్‌...*


- మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి


- మరపడవలపై 8 మంది, మోటర్‌ పడవలపై 6గురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం 


- గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది...పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు


- లబ్ధిదారుల జాబితా ఖరారు అయిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది


*ఈ ఏడాది వేట విరామ సమయం ప్రారంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం చేస్తుందని మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అంతేకాక అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పలు చర్యలు ప్రారంభించారని, వారి అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నట్లు ఆ శాఖా మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు.*


Popular posts
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
బాలల దినోత్సవ సందర్భంగా    వాసవి క్లబ్    ఆధ్వర్యంలో.నోట్ బుక్స్ పంపిణీ..
Image
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*