• ఈ నెల 24 నుండి శ్రీ కాళహస్తి లో పూర్తిగా లాక్ డౌన్
• ప్రజలు ఇంటికే పరిమితం కావాలి
• పాలు, మెడిసిన్స్, నిత్యవసర వస్తువులు పూర్తిగా డోర్ డెలివరి
• శ్రీకాళహస్తి కోవిడ్ – 19 కాల్ సెంటర్లు 9849907502
9849907505
9100929873
మెడికల్ ఎమర్జెన్సీ
8008553660
: జిల్లా కలెక్టర్, డిఐజి, ఎస్.పి, అబ్జర్వర్, స్పెషల్ ఆఫీసర్లు
శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 23: ఈ నెల 24 నుండి పూర్తిగా శ్రీకాళహస్తి లాక్ డౌన్ రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళడం జరిగిందని, నిత్యావసర వస్తువులకు కూడా ప్రజలు బయటరావడానికి అనుమతి లేదని అత్యవసర వస్తువులకు కాల్ సెంటర్ 9849907502, 9849907505, 9100929873,
మెడికల్ ఎమర్జెన్సీ 8008553660 నెంబర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అబ్జర్వర్ సీనియర్ ఐ ఎ ఎస్, ఆర్.పి. సిసోడియా, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, ఆర్బన్ ఎస్.పి. రమేశ్ రెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, స్పెషల్ ఆఫీసర్లు పృథ్వీతేజ్, సునిల్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ కనక నరసా రెడ్డి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్లు సమావేశమై కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా హై పవర్ కమిటీ సమావేశం జరిపి కఠినతర నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియా కు వివరిస్తూ.
*జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ లక్షల జనాభా ఉన్న విశాఖ లోనే 24 కేసులు నమోదు అయితే శ్రీకాళహస్తి లో నేటికీ 47 నమోదు కావడం జరిగిందని ప్రజలు సహకరించి ఈ నెల 24 నుండి ఇళ్ల నుండి బయటకురాకూడదని నిర్ణయించి, నిత్యవసర వస్తువులు, పాలు, మెడిసిన్స్ కూడా ఇంటి వద్దకే వాలంటీర్లు సహకారంతో అందించనున్నామని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి నుండి ఉద్యోగుల రాకపోకలు నిషేదం చేశామని, వీరి వల్ల మరో 7 మండలాలు రెడ్ జోన్ లోకి వెళ్ళాయని తెలిపారు. మే 3 లాక్ డౌన్ వరకు ప్రజలెవ్వరరు బయటకు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు. ఇళ్ళలో కూడా బౌతిక దూరం పాటించాలని, కేవలం 35 వార్డులు గల పట్టణంలో ఇన్ని కేసులు నమోదు కావడం దురదృష్టకరని తెలిపారు. అబ్జర్వర్ సీనియర్ ఐఏఎస్ ఆర్.పి. సిసోడియ అధ్యక్షతన సమీక్ష జరిగిందని అన్నారు. ఇకనైనా జాగ్రత్త పడకపోతే మన చేయి దాటిపోయే ప్రమాదముందని తెలిపారు. పాజిటివ్ వచ్చినా ఎవరూ బయపడరాదని ఇసోలేషన్ తో నయమవుతుందని అన్నారు. ఇలాగే లాక్ డౌన్ సమయం పెరుగుతూ పోతుందని తెలిపారు. 14 రోజులు కేసులు నమోదు కాకపోతే మనం ఆరెంజ్ జోన్ కు వస్తాయని గుర్తుంచుకోవాలని తెలిపారు.
డి ఐ జి:
రేపటి నుండి ప్రజలు ఎవ్వరూ బయటకు రాకూడదు, జిల్లా యంత్రాంగం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇవ్వనున్నదని ప్రజలు సహకరించి మీకు కావలసిన నిత్యావసర సరుకులు సూచించిన కిరాణా షాపులకు ఫోన్ చేస్తే వాలంటీర్లు సహకారం తో మీ ఇంటి వద్దకే అందించనున్నామని తెలిపారు.
అర్బన్ ఎస్.పి : మే 3 వరకు లాక్ డౌన్ అమలు కఠినతరం చేస్తున్నామని ఉదయం 6-9 వెసులుబాటు కూడా రద్దు చేశామని, బయటకు వస్తే చర్యలు తీవ్రంగా వుంటాయి, పెట్రోల్ బంకులు సహా మూతపడతాయి, అతిక్రమిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం మేరకు చర్యలు, 14 రోజులు క్వారంటైన్ కు పంపనున్నామని తెలిపారు. సమాజ శ్రేయస్సుతో పాటు మీ ఆరోగ్యం, మీకుటుంబ ఆరోగ్యం ప్రధానమనే ఆలోచన ప్రజల్లో కలగాని అన్నారు.
ఈ కింద తెలిపిన ఫోన్ నెంబర్లు ఉపయోగించుకోవాలని తెలిపారు.
కాల్ సెంటర్ నెంబర్ లు : 9849907502.
9849907505.
9100929873
మెడికల్ ఎమర్జెన్సీ కోసం
8008553660.
నిత్యావసర వస్తువుల కొరకు కిరాణా దుకాణాల వివరాలు:
సర్వేశ్వర ట్రేడర్స్ 9989709396
బాబ్ జాన్ జనరల్ స్టోర్స్
9848997185
8309025727
అయ్యప్ప జనరల్ స్టోర్స్
9000625935
సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్
9440200349
8247216865
పరమేశ్వరి సూపర్ మార్కెట్
9177066220
శరవణ జనరల్ స్టోర్స్
9849073126
బిస్మిల్లా ఫ్రూట్స్
9618861494
స్యూశరవణ సూపర్ మార్కెట్
9949206491
7842118535
సద్వినియోగం చేసుకోవాలని, సహకరించాలని కోరారు.