సీతారామపురం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరిస్తూ ఇంటియందు సభ్యులతో సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పిటిసి సభ్యులు చెరుకుపల్లి రమణా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మారం రెడ్డి పల్లి పంచాయతీ పరిధిలోని 250 పేద కుటుంబాలకు ఆయన తన సొంత నిధులతో కూరగాయలు, మాస్క్ లను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి పి.సి. అల్లూరు రాజు తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో మండలం మొత్తం కూరగాయలు నిత్యావసర సరుకులను పేద ప్రజలకు అందజేస్తున్నామన్నారు. అందుకు దాతలు ముందుకు వస్తున్నారన్నారు.లాక్ డౌన్ కూలీలు పేదల పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిత్యావసర సరుకులు కొనుగోలు పేదల చేతిలో డబ్బులు లేని పరిస్థితి లో ఉన్నారన్నారు. కావున దాతలు మరొక అడుగు ముందుకేసి పేదలను ఆదుకోవాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి నివారణకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్ర నాయక్, మాజీ ఎంపీపీ నేలటూరు అబ్రహం, నాయకులు రామ్మోహన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, వెంకటేశ్వర్లు, దానమయ్య, సతీష్ తదితరులున్నారు.
మారం రెడ్డి పల్లి పంచాయతీ పరిధిలోని 250 పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ