ఇళ్లకు కూరగాయల పంపిణీ చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి

 
11-4-2020
విజయవాడ.


10900 ఇళ్లకు కూరగాయల పంపిణీ చేసిన
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యేలు జోగి రమేష్ మల్లాది విష్ణు...


ప్రజలు ఇబ్బంది పడకూడదనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ లక్ష్యంలో భాగంగా
లాక్ డౌన్ నేపథ్యంలో  పేద కుటుంబాలకు ఆదుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శనివారం పశ్చిమ నియోజకవర్గం లో 10900 ఇళ్లకు కూరగాయల పంపిణీకి  చలవాది మల్లికార్జున రావు, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు వితరణ చేశారని తెలిపారు.


కాకరపర్తి భావనారాయణ కళాశాల కేంద్రముగా కూరగాయల పంపిణీ
కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు,  కొండపల్లి మురళి (బుజ్జి), ఆదిత్య, తుని గుంట్ల శ్రీనివాస్, కోట సునీల్, కొల్లి సురేష్, శ్యాం ప్రసాద్ తదితరులు ఉన్నారు.


*పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం*..    
                        
సివిల్ కోర్టు వద్ద ఉన్న సి.వి.రెడ్డి కళాశాలలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు శానిటైజర్లతో పాటు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు...


*జర్నలిస్టులకు మాస్కులు*
*శానిటైజర్లతో పాటు*
*కూరగాయలు*, *నిత్యావసర సరుకుల* పంపిణీ చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కార్యక్రమం లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు ఉన్నారు..