ఇంటిబయట తిరగొద్దు.........  ఇంట్లోకి కరోనాని తేవద్దు..: యేమినేని వెంకట రమణ

ఇంటిబయట తిరగొద్దు.........


 ఇంట్లోకి కరోనాని తేవద్దు...........
        యేమినేని వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం  విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి .
      విజయవాడ,ఏప్రిల్ 21 :                         ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం  చేహిస్తుంది  దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా కరోనా కోరలు చాస్తుంది ప్రజల ప్రాణాలు కాపాడడానికి జిల్లా అధికార యంత్రాంగం....
పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రాణాలు ఫణంగా పెట్టి నిరంతరం కృషి చేస్తున్నారు, కంటికి కనిపించని  కరోనాని నియంత్రణ చేసి బాధితులను కాపాడుతున్న ప్రత్యక్ష దేవుళ్ళు వైద్యులు, నర్సులు  రక్తసంబంధాలను సైతం లెక్కచేయకుండా కంటికి రెప్పలా కపడుతున్నారు.........
అలాంటి సమయంలో పనిలేకున్నా మోటారు బైకులపై చక్కర్లు కొడుతున్న ఆకతాయిలు కరోనాకి వారదుల్లా మారుతున్నారు  పోలీసులంటే భయం లేదు ...కరోనా అంటే భయం లేదు.........
భద్రం కొడకో.. అనే తల్లిదండ్రులు మాటలూ లెక్కచేయరు........పోలీసులు బైకులు ఆపితే........ ఆ..........జరిమానెగదా........ లెక్కలేనితనంతో కాలరు ఎగరేసే వారు ఆలోచన మారాలి    మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కంటే మిమ్ములను కాపాడడానికి  పోలీసులు ఎంతో శ్రద్ద వహిస్తున్నారు ...అధికారులు ఆరాటపడుతున్నారు .......


కరోనా సోకితే మీరొక్కరే పోరు......మీతోనే మీ తల్లిదండ్రులు,మీ అర్ధాంగి, మీ తోబుట్టువులు , మీ సంతానం , స్నేహితులు, చివరకు మీ వీధిలో వారు ఆ తరువాత మీ వూరువాళ్ళు...
ఇలా..ఇలా...అందరిని మీ వెంట తీసుకెళ్ళతారు ఒక్కరు బయటకొచ్చి  ఇంత మందిని బలితీసుకోవద్దు..........
పోలీసులు కేసులు రాస్తున్నారు.... జరిమానాలు విధిస్తున్నారు ...ఐనా... మార్పు రాలేదు విజయవాడ వెస్ట్ జోన్ పరిధిలో వన్ టౌన్ , కొత్తపేట, భవనిపురం, పోలీసు స్టేషన్లు ల్లో ...గత  20 రోజుల్లో  వందలాది మోటారు బైకులు , వందలాది ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ....
ఇదంతా వారి వారి టార్గెట్లు పూర్తి చెయ్యడానిక్కాదు......కరోనా కోవిడ్ 19 నియంత్రణ టార్గెట్ లో భాగమే....
నీడపట్టునుండండి ......నిండు నూరేళ్ళ బతకండి .......దిక్కుమాలిన కరోనా నుండి బయటపడి .మీ కుటుంభాలకు  పెద్ద దిక్కుగా నిలబడండీ ......
నిబంధనలు ఖచ్చితంగా పాటించే అధికారులకు అండగా నిలబడండి.. ఇంట్లో ఉంటే ప్రాణాలు పోవు.......బయటకు వస్తేనే .. నీ.. నీవారి....ప్రాణాలు పోతాయి  రక్షక భటుల ,వైద్యుల, ప్రాణాలకే  రక్షణ లేకుండా పోయింది..... ఐనా..... 
వారంతా మీ ..మన.....కోసం నిర్విరామంగా పనిచేస్తున్నారు ..మనం  మనవంతుగా మన ఆస్తులు రాయనవసరంలేదు..... మనం  రేయింబవళ్లు  విధులు నిర్వహించా ల్చినపనిలేదు .......
బయటకు రాకుండా ఇంటిపట్టున వుండి  ఎవ్వరి ఆరోగ్యాన్ని వారు ఎవ్వరి కుటుంబాన్ని వారు కాపాడుకోలేమా.........
మిమ్ములను బలవంతంగా యుద్ధభూమి లోకి దిగమనడంలేదు... ఇంట్లో ఉండే కరోనా పై నిశ్శబ్దం యుద్ధం చేయమంటున్నారు ......
పురప్రజాలరా ఆలోచించండి  ఆయుధాలు లేని యుద్ధం.... శ్రమ లూఠీ కానీ యుద్ధం......
నీడపట్టునుందండి...... ఒక్క చమట బొట్టూ రాకుండా  చేసే యుద్ధం...... గడప దాటకుండా ......కుటుంబసభ్యులు మద్య ఆడుతూ పాడుతూ చేసే యుద్ధం ...
దేశరక్షణ కోసం పోరాడే సైనికులు యుద్ధ భూమిలో
ప్రాణాలు కోల్పోయారు........ దేశం కోసం కాకపోయినా మనకుటుంభం కోసమైనా  మీరు నిశ్శబ్దం యుద్ధం చేయడం కర్తవ్యంగా భావించండి .