4 లక్షల విలువ గల కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్

రాష్ట్రంలో వున్న ప్రతి పేద  కుటుంబానికి *5000 వేలు* ఆర్థిక సహాయం రాష్ట్ర  ప్రభుత్వం ఇవ్వాలి. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్* డిమాండ్ 
 
 *ఈ రోజు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు రూరల్ మండలం గండిగుంటగ్రామంలో* D J R మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దండమూడి చౌదరి, మాజీ గ్రామ అధ్యక్షులు దండమూడి రాంబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు దండమూడి పూజిత పర్యవేక్షణలో మండలంలో వున్న 7800 కుటుంబాలకు ఇంటింటికి కూరగాయలు పంపిణి కార్యక్రమం మాజీ ముఖ్య మంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన సందర్బంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ .


ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ వలన ఎన్నో పేద కుటుంబాలు, వలస కూలీలు ఇల్లు గడవక పస్తులు వుంటున్నారని, ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవటం దారుణమని రాష్ట్రంలో వున్న ప్రతి పేద కుటుంబానికి 5000 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని *రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే ఈ రోజు ఉయ్యురు మండలం 11 గ్రామాల్లో వున్న సుమారు 7800 కుటుంబాలకు  D.J.R ట్రస్ట్ ద్వారా ఇంటింటికి 400000 లక్షల రూపాయలు విలువ చేసే కూరగాయలు పంపిణి కార్యక్రమం చేపట్టిన దండమూడి రాంబాబు, చౌదరి, పూజితని అభినందిస్తున్నానని, వీరి లాగే ప్రతి ఒక్కరు ముందుకి వచ్చి లాక్ డౌన్ లో వున్న పేద కుటుంబాల్ని ఆదుకోవాలని రాజేంద్ర ప్రసాద్  పిలుపునిచ్చారు 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు మండల పార్టీ అధ్యక్షులు వేమూరి శ్రీను, గండిగుంట సర్పంచ్ అభ్యర్థి కొండా రత్నవేణి, కొండా ప్రవీణ్, రాజేంద్ర యువత, చౌదరి ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గున్నారు.