ధరిత్రి దినోత్సవానికి 50 సంవత్సరాలు : గూడూరు లక్ష్మి

ధరిత్రి దినోత్సవానికి 50 సంవత్సరాలు .                


    నెల్లూరు ఏప్రిల్ 22 ( అంతిమ తీర్పు):     నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం .పుడమి పరిరక్షణకు ప్రతి వ్యక్తి తన వంతు కృషి చేయాలని యావత్ ప్రపంచం అనేక  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. సమస్త కోటి అవసరాలను తీరుస్తున్న భూమి మానవ చర్యల వల్ల ఎలా అస్తవ్యస్తం అవుతుందో అందరికీ తెలిసిందే పచ్చని అడవులను కోతపెట్టి,సున్నిత నదీతీరాల ధ్వంసం చేసి,  గనుల పేరుతో విచ్చలవిడిగా తవ్వేసి రకరకాలుగా పుడమిని హింసలు పెడుతున్నా అహింసా మార్గంలో శాంతిస్తునే ఉంది. నేటికీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం గా పేర్కొని 50 వ సంవత్సరాలు.  
తొలి ఎర్త్‌డే (1970) రోజు అమెరికా వీధుల్లో వేలాది మంది పారిశామ్రిక విప్లవానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎర్త్ డే’ పేరును 2009లో ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే’ గా మార్చింది.
ప్రకృతి చూసి చూసి విసిగి వేసారి ఎవరు మారరు ప్రకృతికి సహకరించడం  వ్యక్తులు వల్ల కాదనేమో" కరోనా "రూపంలో వ్యక్తి తనని తనే సంస్కరించుకునే కార్యక్రమం మొదలు పెట్టింది. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాలుష్యం చేయడం మాని ఇంటిపట్టున ఉండడం ఎవరి పాటికి వారు శుభ్రం పాటిస్తూ పట్ల వాహన కాలుష్యం పట్ల ఎండలు విపరీతంగా మండిపోతూ ఏసీలు వాడే పరిస్థితిని కూడా కట్టుదిట్టం చేసుకుని నిద్ర లేస్తే ప్రజలలో ఉండే చల్లటి  మంచినీరు కై రిఫ్రిజిరేటర్ లను వాడే పరిస్థితి, మాంసాహారం నుంచి శాఖాహారులకు, విపరీతమైన మద్యం సేవించే వారిపై మద్య నిషేధాన్ని, ప్రతిరోజు ఆదాయం పైనే దృష్టి పెట్టి అందమైన జీవితాన్ని గుర్తు చేస్తూ, తన వారిని తను ఆప్యాయంగా పలకరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఒకింత అప్రమత్తతతో  ఉండమని భయం కల్పిస్తూ, శుచి శుభ్రత పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్లని, పర్యావరణం అంటే ఎలా ఉంచుకోవాలో  బాధ్యతను పారిశుద్ధ్య కార్మికుల పై, రహదారులను అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా వాడి  పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడే బాధ్యతను రక్షక భటులను ఏర్పాటుచేసి, ఆర్థిక వ్యవస్థ విస్తు పోకుండా కావలసిన వారికి బ్యాంకు వ్యవస్థను, జనజీవన స్రవంతి ఇబ్బంది పడకుండా వారికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రత్యక్ష  భగవంతుడంటే మీరేనని తెలియజేస్తూ ఒకరికొకరు సాదరంగా సహాయం చేసుకోవటం ప్రకృతి మనకి  నేర్పిస్తుంది. ఎవరికివారు తెలుసుకొనేలాగా ప్రకృతే అధ్యయన తరగతులు నిర్వహిస్తూ ప్రతి వ్యక్తిని ఆలోచింపచేసే సమయాన్ని ఇచ్చి "లాక్డౌన్ "రూపంలో ఇంట్లోనే బందీ చేసింది.  మన వారసులకు మనం చక్కటి ఆహ్లాదకరమైన భూమిని ఇవ్వవలసింది పోయి, శ్మశానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారా? భూగోళాన్ని పరిరక్షించే చర్యలకు ఎందుకు చేపట్టలేదని మనల్ని తిరిగి ప్రశ్నిస్తే? మనమేం సమాధానం ఇస్తాం?   ఈ ప్రశ్నలు ప్రశ్నించుకొని  "మన  దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే","స్వచ్ఛతకు  పట్టుకొమ్మలు గ్రామాలే" అన్న మహాత్మాగాంధీ గారి  పిలుపు,ఆశయాలకు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేయాలని"పల్లె గాంధేయం"పేరుతో "భూమాత పై సప్త పాపాలు నిత్య  క్షమాపణలు" అనే ఒక  కరపత్రాన్ని రూపొందించచాము. ప్రకృతి ప్రేమికులు, సమాజ సేవకులు, శ్రీ తిక్కవరపు సుకుమార్ రెడ్డి  వారి అక్షర రూపంలో, నేను(గూడూరు  లక్ష్మి) ఆలోచనాక్షరాలతో ఒక కరపత్రాన్ని రూపొందించి కలెక్టర్ జానకి గారి చేతుల మీద విడుదల చేయించి పల్లిపాడు  గ్రామంలో(పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం ఉన్నచోటు) ఇంటింటికి తిరిగి వారికి అవగాహన  కల్పించడం జరిగింది. పల్లెపాడు ప్రధాన రహదారి రెండు కిలోమీటర్ల దూరం తో జన ప్రజానీకం నడిచి వెళ్లాలంటే మూసుకుని వెళ్లే పరిస్థితి ఈ కారణంగా అనేక మంది గ్రామ ప్రజలు రోగగ్రస్తులనూ అవ్వటం గమనించి ఆ రెండు కిలోమీటర్ల శుభ్రపరిచే కార్యక్రమాన్ని తీసుకున్నా మేము మొదలు పెట్టిన రోజు ఒక పూర్తి రోజు సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది అలా  6 నెలల కాలం పాటు ఆరు విడతలుగా రెండవ శనివారం ని ఎంచుకుని గ్రామంలో కొంత మంది విద్యార్థినీ విద్యార్థులు మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మేము ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పెద్దలు కన్వీనర్ శ్రీ కృష్ణారెడ్డి , శ్రీ ఆదిత్య , శ్రీ నేదురుమల్లి  సుబ్బారెడ్డి  సహకారంతో గ్రామమంతా తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. లక్ష్యంగా ఎక్కువ భాగం సుకుమార్  రెడ్డి , నేను విద్యార్థులు ప్రతి కార్యక్రమంలో స్వయంగా  అదో పైన అది కాదుపాల్గొనడం జరిగింది. ఇదంతా చూసిన గ్రామ ప్రజలు ఎక్కడినుంచో వచ్చి శుభ్రం చేయాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మా వంతు సహకారాన్ని అందిస్తామని ఆరు నెలల కాలంలో ఆ వీధిలో అంతా కూడా బహిర్భూమి గా వాడటం మాన్పించి పూర్తిగా సహకరించిన గ్రామస్తులు అందరినీ ప్రత్యేకంగా ఇంటింటికీ వెళ్లి అభినందించాము.  అత్యంత తక్కువ ఖరీదుకి శౌచశాలలు నిర్మించుకోవచ్చు అది మన జీవన విధానంలో ఒక భాగమని ఇందుకు ఎవరో సహాయం ఆశించటం, యాచించడం అవమానకరమని వారికి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని,ఆలోచించాలని గ్రామంలో అవగాహన కల్పించిన తీరుని కలెక్టర్ జానకి  ప్రశంసించారు. మంచి కార్యక్రమం నిర్వహించాలనిఅభినందించారు.  ఈ కరపత్రం చదివిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ  భూమాత పై ఇలాంటి కరపత్రం ముద్రించిన అందుకు మమ్మల్ని ప్రశంసించారు.మరి  మనమందరం ధరిత్రీ  దినోత్సవాన్ని జరుపుకొని ఆనందించటం కాకుండా పాటించి  ప్రకృతికి సహకరిద్దాం. ప్రణామం,ప్రణామం  ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం.........గూడూరు లక్ష్మి MA(GandhianThought ,(llb)
Director: Sri Kalalaya charitable Trust ,Pogathota, NELLORE.       cell:944168900.