ప్రజల్ని కట్టడి చేసిన ప్రభుత్వం విజయసాయిరెడ్డిని ఎందుకు నియంత్రించటం లేదు కన్నా

 


 


     గుంటూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు):     కన్నా లక్ష్మీనారాయణ గారు పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి బిజెపిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారు  అని అన్నారు. రాష్ట్రంలో       వైకాపా గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది.గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేశారు.విజయసాయిరెడ్డి కానిపాకంలో ప్రమాణం చేసేందుకు అంగీకరిచటం స్వాగతిస్తున్నా అని అన్నారు.  విజయసాయిరెడ్డి ఆ మాటకు కట్టుబడి ఉండాలి


చంద్రబాబు నుంచి నాకు 20 కోట్లు ముట్టాయని ప్రమాణం చేయాలి


లాక్ డౌన్ ముగియగానే తేది నిర్ణయిస్తాం


లాక్ డౌన్ సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు


వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా తిరగటం వల్లే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దిశగా సాగుతోంది


ప్రజల్ని కట్టడి చేసిన ప్రభుత్వం విజయసాయిరెడ్డిని ఎందుకు నియంత్రించటం లేదు


బిజెపి లో నిధుల దుర్వినియోగం పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం


ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి బిజెపి కి లేదు


మీ మాదిరిగా కులం కుటుంబం, అవినీతి బిజెపికి లేదు


ప్రతి వారం కోర్టుకు వెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేయటం విజయ సాయికి అలవాటే


అలాగే కానిపాకంలో ప్రమాణం చేసేందుకు రావాలి


అధికార మదంతో వైకాపా నేతలు మాట్లాడుతున్నారు


రాజధాని విశాఖపట్నం వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది


వైకాపా నేతలు డబ్బులు పంచి అధికారంలోకి వచ్చారు కాబట్టి అందరూ అలాగే ఉంటారా


పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపించడం మామూలే


నేను కిట్లు విషయంలో రేట్ల తేడా గురించి మాట్లాడితే నాపై వ్యక్తిగత ధూషణలు చేస్తున్నారు


దీన్ని బట్టే ప్రజలు ఏం జరిగిందో అర్థం చేసుకుంటారు


విజయసాయిరెడ్డి జీవితం తెరిచిన పుస్తకమో కాదో ప్రజలకు తెలుసు


ప్రభుత్వం నుంచి నేను వివరణ అడిగాను... వేర్వేరు ధరలపై ప్రశ్నించాను


దానిపై ప్రభుత్వం కాకుండా విజయసాయిరెడ్డి ఎందుకు స్పందించడం


మీరు తప్పు చేశారు కాబట్టే వ్యక్తిగత ధూషణలతో విషయం పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు


దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని భావిస్తున్నా


ప్రభుత్వం మీద మాట్లాడేందుకు చాలా ఉన్నాయి


కానీ కరోనా సమయంలో రాజకీయాలు వద్దని మౌనంగా ఉన్నా


కరోనా విజృంభిస్తుంటే రాజధాని మార్పు గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారు


మీకు రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా


ప్రభుత్వం కరోనా కేసులు దాచిపెడుతుందని నేను నమ్ముతున్నా