కరోనా కేసుల సంఖ్యను దాచే ప్రయత్నం చేయొద్దు: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

కరోనా కేసుల సంఖ్యను దాచే ప్రయత్నం చేయొద్దు


కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు.


ఎక్కువ మందికి టెస్టులు నిర్వహించడంతో కేసులు పెరగవచ్చు.


కరోనా నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోండి.


రెడ్ జోన్,కంటైన్మెంట్ జోన్లు పై ప్రత్యేక దృష్టి పెట్టండి.


కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.


అమరావతి,26ఏప్రిల్:దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణ కు లాక్ డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ (Rajiv Gauba) అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుండి  ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ ఏరాష్ట్రంలోను కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం లేదా దాచిపెట్టడం వంటి ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేశారు.కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో దేశవ్యాప్తంగా మంచి మెరుగుదల కనిపిస్తోందని ఇదే స్పూర్తిని మరికొన్ని రోజులు పాటించ గలిగితే కరోనాపై పోరాటంలో విజయం సాధించ గలుగుతామని పేర్కొన్నారు.
ముఖ్యంగా రెడ్ జోన్లు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించు కోవాలని అయిన  చెప్పారు.ఇప్పటి వరుకూ దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాకుండా ఆయా జిల్లాల్లో అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.


రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడ కుండా ఎవరి ఇళ్ళలో వారు ఆలాంటి వేడుకలను జరుపుకోవాలని ఆయన హితవు చేశారు. ఈవిషయమై ఆయా మతపెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు.


రేషన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు తీసుకునే చోట లేదా రైతు బజారులు,ఎటిఎంలు, బ్యాంకులు వంటి ప్రతి చోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజలందరిలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.


ఈవీడియో సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ కొవిడ్ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఏంటిజెన్ టెస్టులకు ఆర్టిపిసిఆర్,ట్రూనాట్ పరికరాలు ద్వారా రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని ఈసంఖ్యను పది వేలకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తునచనట్టు సిఎస్ నీలం సాహ్ని వివరించారు.దక్షిణ కొరియా నుండి దిగుమతి చేసుకున్న కిట్లతో పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నట్టు చెప్పారు. ఇంకా ఎవరెవరికి ఎక్కడెక్కడ టెస్టులు నిర్వహించాలనే దానిపై మరిన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబను కోరారు.


ఈ వీడియో సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ఐజి వినీత్ బ్రిజ్లాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image