వైద్య బృందాల పై దాడులు చేసే వారికి తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ లభించదు

*ఢిల్లీ*


వైద్య బృందాల పై దాడులు చేసే వారికి తాజా ఆర్డినెన్స్ ప్రకారం ఎటువంటి బెయిల్ లభించదు


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ భాధితులకు చికిత్స అందించేందుకు 723 కోవిడ్-19 హాస్పటల్స్ ఏర్పాటు


1.85 కరోనా వైరస్ భాధితులకు బెడ్లు ఏర్పాటు


2.5 కోట్ల ఎన్-95 మాస్కుల తయారీకి ఆర్డర్, ప్రస్తుతం 24 లక్షల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి.


కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యుల పై ఎటువంటి దాడులకు పాల్పడిన ఉపేక్షించేది లేదు.


వైద్యుల వాహనాలను, ఆస్తులను ధ్వసం చేస్తే, వారి నుండి మార్కెట్ ధర కంటే రెట్టింపు ధర జరిమానాగా వసూలు చేస్తాం


వైద్యుల పై దాడి కి పాల్పడే వారికి 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించబడుతుంది.


వైద్య సిబ్బందిపై దాడులు అరికట్టేందుకు కేంద్రం ఆర్డినెన్స్


1897నాటి ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్‌లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ , కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం


రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా


వైద్యుల నుంచి ఆశా వర్కర్ల వరకు, వైద్య రంగ సిబ్బంది అందరికీ రూ. 50 లక్షల బీమా


*ప్రకాష్ జవదేకర్ (కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి )*