టి.డి.పి యువనేత ' వీరనారాయణ ' గుండెపోటుతో మృతి

టి.డి.పి యువనేత ' వీరనారాయణ ' గుండెపోటుతో మృతి


వింజమూరు, ఏప్రిల్ 13: (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువజన విభాగం నేత కొంపల్లి. వీరనారాయణ(36)  సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వివరాలలోకి వెళితే మండలంలోని చంద్రపడియ గ్రామానికి చెందిన వీరనారాయణ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నారు. స్వతహాగా తెలుగుదేశం పార్టీ అభిమాని అయిన వీర నారాయణ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ చురుకైన నేతగా పేరు ప్రఖ్యాతులు గడించారు. సోమవారం ఉదయం హైదారాబాదులోని తన నివాసంలో గుండెనొప్పితో అస్వస్థతకు గురి కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు, వీర నారాయణ అనుయాయులు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీరా అని సంభోధించే వీరనారాయణ అకాల మరణం పట్ల అతని కుటుంబంతో పాటు టి.డి.పి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ బలీయమైన యువనేతను కొల్పోయిందని నేతలు చల్లా.వెంకటేశ్వర్లు యాదవ్, యన్నం.రామచంద్రారెడ్డి, దంతులూరి.వెంకటేశ్వర్లు, పాములపాటి.మాల్యాద్రి, గూడా.నరసారెడ్డి, గొంగటి.రఘునాధరెడ్డిలు విచారం వ్యక్తం చేస్తూ వీరనారాయణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.