విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదు : సబ్   కలెక్టర్

విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదు : సబ్   కలెక్టర్
- గూడూరు : విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదని గూడూరు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు నిరూపించారని గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణకు కరోనా మహమ్మారి కట్టడికి తమ వంతు సాయంగా 25వేల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సైతం తమ దాతృత్వం చాటుకోవడం స్పూర్తిదాయకం అన్నారు. కరోనా మహమ్మారితో  మానవజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వైరస్ కట్టడికి, అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటివరకూ సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ బాష మాట్లాడుతూ తమవంతు బాధ్యతగా సంఘం తరపున 25వేల రూపాయలను సబ్ కలెక్టర్ కి చెక్కు రూపంలో అందించామన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు బీడీ. జయకుమార్, షేక్. బాష, ఏ. భాస్కర్ రావు, జీ. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.