అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని సీఎం ఆదేశం

*22–04–2020*


*అమరావతి:
కోవిడ్‌–19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


*రాష్ట్రంలో కోవిడ్‌ –19 వైరస్‌ విస్తరణ, పరీక్షల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు*
*ఇప్పటివరకూ 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడి*
*ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీ , 809 పరీక్షలతో రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌*
*ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని తెలిపిన అధికారులు*
*నిన్న ఒక్కరోజే 5,757 పరీక్షలు చేసిన ఏపీ*



*కొరియా ర్యాపిడ్‌ కిట్ల పనితీరు సంతృప్తికరం:


ర్యాపిడ్‌ టెస్టు కిట్లపైనా సమావేశంలో చర్చ
మన రాష్ట్రానికి రాజస్థాన్‌ తరహా చైనా కిట్స్‌ను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకు వచ్చారని తెలిపిన అధికారులు
అయితే, కొన్ని కిట్లను చెక్‌చేసి చూశామని, ఇదివరకే పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను, నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను ఆ కిట్స్‌ ద్వారా పరీక్షిస్తే ఫలితాలు సంతృప్తి కరంగాలేనందున కొనుగోలులో ముందుకు వెళ్లలేదని సీఎంకు తెలిపిన అధికారులు
దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను కొరియా నుంచి తెప్పించుకున్నామన్న అధికారులు
అమెరికాకు వెళ్లాల్సిన ఈ కిట్లను.. అతి కష్టమ్మీద చార్టర్‌ విమానం ద్వారా తెప్పించుకున్నామన్న అధికారులు
ఇప్పటికి 5–6వేల శాంపిళ్లను పరిశీలించామని, మంచి పనితీరు కనబరుస్తున్నాయని వెల్లడించిన అధికారులు


*కోవిడ్‌ –19 రోగులకు వైద్య విధానంలో మెరుగైన పద్ధతులు:*


కోవిడ్‌–19 రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం, పరిశీలన చేస్తున్నామన్న అధికారులు
కోవిడ్‌ సోకిన రోగికి నిరంతరం ఆక్సిజన్‌ లెవల్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్న అధికారులు
రోగులకు పల్స్‌ఆక్సీ మీటర్లు పెడుతున్నామన్న అధికారులు
వీటిని మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడి
ప్రతి 6 గంటలకు ఒకసారి ఆక్సిజన్‌ లెవల్‌ చెక్‌ చేస్తున్నామని సీఎంకు వెల్లడి
తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్న సీఎం
వీలైనన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చూసుకోవాలన్న సీఎం



ప్రతి రోగికీ కేస్‌  షీట్‌ తయారుచేస్తున్నామన్న అధికారులు
కోవిడ్‌ సోకిన రోగికి అందించాల్సిన వైద్య విధానంపై స్డాండర్డ్‌ ప్రోటోకాల్‌ కూడా పెడుతున్నామన్న అధికారులు
రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులే కాకుండా జిల్లాల్లో ప్రథమంగా గుర్తించిన ఆస్పత్రులతో కలిపి మొత్తం 18 ఆస్పత్రుల్లో కూడా ఈ ప్రోటోకాల్‌ అమలయ్యేలా చూస్తున్నామన్న అధికారులు
వైద్యులకూ తగిన శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు


ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి వెంటనే వైరస్‌ను నిర్ధారించేలా ఒక ట్రూనాట్‌ మిషన్‌ను పెడుతున్నామని వెల్లడించిన అధికారులు
దీనివల్ల.. 2 గంటల్లోగా ఫలితం వస్తుందని, తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని వెల్లడించిన అధికారులు
అలాగే పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయడానికి వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కూడా పెట్టామన్న అధికారులు


టెలీమెడిసన్‌లో 300 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని వెల్లడించిన అధికారులు
టెలీమెడిసన్‌లో కాల్‌చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాదు మందులు కూడా వెళ్లాలన్న సీఎం
శనివారంలోగా దీన్నికూడా ప్రారంభిస్తామన్న అధికారులు


*ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య 7587 మంది*
వీరందరికీ పరీక్షలు జరగాలని స్పష్టంచేసిన సీఎం



అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని సీఎం ఆదేశం
అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలన్న సీఎం 


*నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని సీఎం ఆదేశం*
నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం


*రైతుభరోసా, మత్స్యకార భరోసాలపై సీఎం సమీక్ష*
లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాలపాటు ప్రదర్శించాలని స్పష్టంచేసిన సీఎం
తర్వాత గ్రీవెన్స్‌ కోసం కనీసం వారంరోజుల సమయం ఇవ్వాలని ఆదేశించిన సీఎం


*ఆక్వా ఉత్పత్తులను నిల్వచేయడానికి కోల్డ్‌స్టోరేజీలపై దృష్టిపెట్టాలని సీఎస్‌కు సీఎం ఆదేశం*
ఫాంగేట్‌ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతగా అమలు చేయాలన్న సీఎం
కూపన్‌ విధానం ఏరకంగా పనిచేస్తుందో పర్యవేక్షణ చేయండని అధికారులకు ఆదేశం
గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లను వినియోగించుకోవాలన్న సీఎం
ఆయిల్‌పాం ధర తగ్గుదలపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదన్న సీఎం
పక్క రాష్ట్రంలో ఉన్న రేటుకన్నా.. తక్కువకు కొనే పరిస్థితి ఉండకూడదన్న సీఎం


*‘కోవిడ్‌ –19 నివారణా జాగ్రత్తలతో గ్రీన్‌ క్లస్టర్లలో కార్యకలాపాలు:*
ఇచ్చిన సడలింపులు మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్‌ నివారణా చర్యలపై అవగాహన బాగా కల్పించాలన్న సీఎం
దీనివల్ల కార్యకలాపాలు సజావుగా సాగడానికి అవకాశాలు ఉంటాయన్న సీఎం
రెడ్, ఆరెంజ్‌ క్లస్టర్లలో  నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలన్న సీఎం
గ్రీన్‌ క్లస్టర్లలో మాత్రం సడలించిన నిబంధనలమేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలన్న సీఎం
గ్రీన్‌ క్లస్టర్లలోని పరిశ్రమలు, అగ్రి ప్రాససింగ్‌ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం పాటించి ఆమేరకు ఆయా కార్యకలాపాలు ముందుకు సాగేలా చూడాలన్న సీఎం


సమావేశానికి హాజరైన మంత్రులు బొత్సా సత్యన్నారాయణ, కన్న బాబు 
సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు


*గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి:*


గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల అంశంపై సమావేశంలో చర్చ
వారికి తగిన సదుపాయాలు, ఆహారం అందించాల్సిందిగా గుజరాత్‌ సీఎంకు ఫోన్‌ చేశాం : సీఎం
దీనిపై కేంద్ర ప్రభుత్వ అ«ధికారులతో కూడా మాట్లాడమన్న అధికారులు
వసతి, భోజనం విషయంలో కొన్ని రకాల చర్యలు తీసుకున్నారన్న అధికారులు
దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు సీఎం ఆదేశం
అంతేకాకుండా గుజరాత్‌లో ఉన్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశం
అక్కడున్న సుమారు 6వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందచేయాలన్న సీఎం
ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని ఇది అమలయ్యేలా చూడాలన్న సీఎం